28.7 C
Hyderabad
April 28, 2024 08: 16 AM
Slider ముఖ్యంశాలు

భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలి

DYFI

భగత్ సింగ్ 114 వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉప్పల్  లో ఘనంగా జరిగాయి. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  DYFI  మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు కోమటి రవి హాజరై   భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి  మన దేశం నుంచి తరిమి కొట్టీ భారతమాత  సంకెళ్లను విముక్తి చేయడానికి ప్రాణాలకు అర్పించిన భగత్ సింగ్ ఆశయాలు  అమలు కాకపోవడం  దేశంలో  ప్రమాదకరమైన పరిస్థితి  ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.  

దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప పోరాట వీరుడు భగత్ సింగ్  అని భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలి అని ఆయన  అన్నారు. కార్యక్రమంలో  DYFI మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ముష్యం కిరణ్,   మాజీ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు   వెంకన్న. ఎర్రం శ్రీనివాస్.  శ్రీను  నరేష్.  భాష. విశ్వంత్.  డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు

Related posts

మున్సిపల్ సమావేశం తక్షణమే నిర్వహించాలి

Satyam NEWS

నిబద్దతతో విధులు నిర్వహించాలి

Bhavani

స్కూలు మానేసిన వారిని తిరిగి చేర్చాలి

Bhavani

Leave a Comment