Slider ఖమ్మం

విద్యకు అత్యంత ప్రాధాన్యత

#puvvada

ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యనిచ్చి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య నందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పున్వాడ అజయ్ కుమార్ అన్నారు.  చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో రూ. 35 లక్షలతో నిర్మించిన జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు పెంచటంతో పాటు విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. గ్రామంలో దాతలు పాఠశాలకు స్థలం అందజేయటంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి పాఠశాల్లో మౌళిక వనతులకు విరాళాలు ఇవ్వటం పాతర్లపాడు గ్రామానికి ఆదర్శనీయమని కొనియాడారు. విద్యార్థుల సౌకర్యార్ధం ఫర్నీచర్ ఏర్పాటుకు గ్రామానికి చెందిన కొత్తపల్లి రంగయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబికులు రూ.30 వేల చెక్కును మంత్రికి అందజేశారు. అనంతరం మంత్రి దళితబందు యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వింతకాని మండలంలో 3,462 దళిత కుటుబాలకు గాను నూరుశాతం గ్రౌండింగ్ చేసినట్లు  పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలను మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లితండ్రులకు సూచించారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దళితబంధు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో సైతం దళితలందు పథకం గురించి తాను ప్రస్థావించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మౌళిక సదుపాయాలు సమకూరుతాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి. చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్థానిక సంస్థల అదనపు కలెక్టరు స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ రాధిక గుప్తా, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్, మండల ప్రత్యేక అధికారి శిరీష, జిల్లా రవాణా శాఖ అధికారి టి. కిషన్ రావు, పంచాయిరాజ్ S.ఇ కె.వి.కె.శ్రీనివాస్ రావు, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, ఆర్.అండ్.బి. బి.ఇ. శ్యాప్రసాద్, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, తహశీల్దారు మంగిలాల్, జడ్పీటిసి తిరుపతి కిషోర్, గ్రామ సర్పంచ్ పిచ్చయ్య, కార్యదర్శి మహేష్, తదితరులు ఉన్నారు.

Related posts

సోషల్ మీడియా వేదికగా బీజేపీ దుష్ప్రచారం

Satyam NEWS

మంత్రి పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చిన వంగవీటి రాధ

Satyam NEWS

ఘనంగా మోత్కుపల్లి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment