30.7 C
Hyderabad
April 29, 2024 06: 44 AM
Slider ప్రత్యేకం

బిఆర్ఎస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు

#puvvada

బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలనే కాపీ కొట్టి, ఏదో చేస్తామంటూ కాంగ్రెస్ చెపుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఖమ్మం పార్టీ కార్యాలయంలో ఎంపీ లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ 15 వ తేదీన అందరూ బీ ఫాంలు అందుకున్న తర్వాత సమావేశంలో పాల్గొంటున్నాం అని, గడచిన 5ఏళ్లు ప్రజలు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చూశారన్నారు. 2014, 18 ఎన్నికల లాగా కాకుండా ఇప్పుడు అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు, మేధావులు అంతా సీఎంగా కేసిఆర్  మూడవసారి విజయం సాధిస్తారు అని ఇప్పటికే వెల్లడించారన్నారు. సీఎం కెసిఆర్ కు ఖమ్మం జిల్లా నుండి అత్యధిక సీట్లు గెలిచి బహుమతిగా ఇస్తాం అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసు, ప్రత్యర్థి పార్టీలు వారికి అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి తర్జన భర్జన అవుతున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని, అభివృద్ది వైపే నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర జిల్లాలతో పాటు ఇతర జిల్లాల కంటే ఎక్కువగా సీఎం కెసిఆర్  ఖమ్మం జిల్లాకు పెద్ద పీట వేశారని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆలోచన చేయాలని, .తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొదటి సారి 63, రెండవసారి 84 సీట్లు సీఎం కెసిఆర్కి అందించారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తమ కార్యక్రమాలను, హామీలను కాపీ కొట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో పించన్ వందల్లోనే ఇచ్చిందని,  దాన్ని వేలు చేసింది సీఎం కేసిఆర్  ప్రభుత్వం అన్నారు.కేంద్ర ప్రభుత్వం కూడా తమ పథకాలను కాపీ కొట్టిందని, కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన చెప్పిందే చేస్తారని వెల్లడించారు. మనం కూడా మన కుటుంబ సభ్యులకు భీమా చేపించం అని,  కానీ కేసిఆర్ భీమా అని పెట్టడం ద్వారా సీఎం కెసిఆర్ కు రాష్ట్ర ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. మంచి ఉంది అంటే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేము తీసుకుంటాం మంచిని మేము విమర్శించం అన్నారు. చిన్న రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన సీఎం కెసిఆర్ కు మూడవసారి విజయం అందించే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనే ఉండన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ఖమ్మం ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తున్నామ్మన్నారు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10 ఏళ్లలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు.సంక్షేమ పథకాల అమలులో కూడా దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.కేసిఆర్ ను మూడవ సారి సీఎంగా ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.కేసిఆర్ కు పేదలు, రైతులు, కరెంట్, నీటి కష్టాల విలువ తెలుసు కాబట్టి గొప్ప గొప్ప పథకాలు రాష్ట్రానికి అందించారన్నారు.ఇప్పటికే దేశంలో కరెంట్ విషయంలో పర్ క్యపిటా లో మనమే నంబర్ వన్ అన్నారు.గత 10 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీను మేము చూసి చూపాం అని, ఇప్పుడు ఇచ్చే హామీలను చేసి చూపుతాం అన్నారు.

60 ఏళ్లలో ఆ పార్టీ ఏమి చేసింది లేదు కానీ ఇప్పుడు ఆ పార్టీ వచ్చి 6 గ్యారెంటీలు అంటుందన్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపి వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మేల్యే రాములు నాయక్, బిఆర్ఎస్ అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి), మధన్ లాల్(వైరా), లింగాల కమల్ రాజ్(మధిర), నాయకులు పగడాల నాగరాజు, RJC కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్ ఉన్నారు.

Related posts

వెన్నెముక అయిన రైతు నడ్డివిరిచే చట్టాలు ఇవి

Satyam NEWS

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఆసీస్‌.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజ‌యం

Satyam NEWS

Leave a Comment