39.2 C
Hyderabad
May 3, 2024 12: 44 PM
Slider ముఖ్యంశాలు

మే 10న కర్నాటకలో ఎన్నికలు

#karnataka

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.62 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్లు 2.59 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా ఒక వెసులుబాటును కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 16,976 మంది ఉన్నరు. వందేళ్లు పైబడిన ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటకే కావడం గమనార్హం. మరోవైపు కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది, కాంగ్రెస్ కు 75, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Related posts

హుజూరాబాద్ దళితబంధు కోసం రూ.2 వేల కోట్లు విడుదల

Satyam NEWS

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి

Satyam NEWS

హోల్సిమ్ వాటాలు కొనుగోలు చేసిన అదానీ

Satyam NEWS

Leave a Comment