38.2 C
Hyderabad
May 2, 2024 19: 48 PM
Slider గుంటూరు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం: తమ్ముడి మృతి

#sortcircut

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో సంతగుడిపాడు గ్రామం లో ని ఎస్టీ కాలనీలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న అన్నదమ్ముల్లో తమ్ముడు మృతి చెందగా అన్నకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో సంతగుడిపాడు గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన భువనగిరి ఏసు  దేవి భార్య భర్తలు. వారు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాదులో ఉంటున్నారు.

వారి ఇరువురు కుమారులు భువనగిరి లక్ష్మీ ప్రసన్న కుమార్ భువనగిరి నాగేంద్రబాబు పాఠశాలలు ప్రారంభించటంతో  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వచ్చారు. అయితే బుధవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో అన్నదమ్ములు ఇరువురు ఇంట్లో తలుపులు వేసుకొని నిద్రపోతున్నారు.

ఈ వర్షానికి ఆ ఇంట్లో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున  మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వారు భయాందోళన చెంది  కేకలు వేశారు. చుట్టుపక్కల ఉన్న వారు స్పందించి  ఇంట్లో మంటలను ఆర్పివేసేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు.

విద్యుత్ శాఖ అధికారులకు  కాలనీలో కరెంట్ నిలిపివేయమని  ఫోన్ ద్వారా తెలియజేసిన వారు స్పందించలేదు. కాలనీవాసులు వెంటనే దగ్గర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతర ఇంట్లోకి వెళ్లి చూడగా తమ్ముడు భువనగిరి నాగేంద్రబాబు(12)కు శరీరమంతా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

అతని అన్న భువనగిరి లక్ష్మీ ప్రసన్న కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన లక్ష్మీప్రసన్నకుమార్ ను 108 ద్వారా  చికిత్స నిమిత్తం  నరసరావుపేటలో ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.ఇంట్లోని విలువైన వస్తువులు సామాన్లు దుస్తులు పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

అనంతరం సమాచారం తెలుసుకున్న ఎస్ ఐ పి.హజరత్తయ్య పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సంఘటన జరిగిన తీరును అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని కాలనీవాసులు ఎస్ ఐ దృష్టి కి తీసుకొచ్చారు.

వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని విద్యుత్ అధికారుల పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమకున్న ఇద్దరు కుమారులలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు కావటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ సంఘటనతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ముతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.హజరత్తయ్య తెలిపారు.

Related posts

వల్గర్ ఫాదర్:కన్నతండ్రే కామాంధుడయ్యాడు

Satyam NEWS

అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Satyam NEWS

ఉత్తమ టైర్ మైలేజీ సాధించిన నరసరాపుపేట ఆర్టీసీ డిపో

Satyam NEWS

Leave a Comment