38.2 C
Hyderabad
April 29, 2024 22: 20 PM
Slider ముఖ్యంశాలు

నాలుగు నెల‌లో రామతీర్ధం ఆల‌య నిర్మాణం పూర్తి చేసాం

#minister

విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్ధం నీలాచ‌లంకొండ‌పై   గత ఏడాది డిసెంబర్ లో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించిన‌ప్ప‌టికీ… కేవలం నాలుగు నెలల కాలంలో మొత్తం ఆల‌యాన్ని  పూర్తి చేశామని… ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంంత్రి మెట్టు స‌త్య‌నారాయ‌ణ అన్నారు. మూడు కోట్లతో రికార్డు సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట చేయడం సీఎం జ‌గ‌న్ కు ఉన్న‌ వున్న చిత్తశుద్ధికి నిదర్శనమ‌న్నారు.

అనంత‌రం విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ మాట్లాడుతూ..వ‌చ్చే శ్రీరామన‌వమి నాటికి రామ‌తీర్ధంలో అధికారికంగా  బొడి కొండ‌పై శ్రీరామ‌న‌వమి ఉత్స‌వాన్ని జ‌రుపుతామ‌ని  అన్నారు. రామతీర్థం లో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలను రాష్ట్ర పండుగ గా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ‌ని..మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజ‌య‌న‌గరం జిల్లా నెల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధం బొడికొండ‌పై కొత్త ఆలయం..అందులొ కొత్త‌గా సీతారాముల విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ  మేర‌కురాష్ట్ర దేవాదాయ‌,ధ‌ర్మాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టుస‌త్య‌నారాయ‌ణ స్వ‌హ‌స్తాల‌తో ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అదే విధంగా స్థానిక మంత్రి మంత్రి ఇటీవ‌లే విద్యాశాఖ మంత్రి గా బాధ్య‌తలు చేప‌ట్టిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ఎం.శ్రీనివాస‌రావు,నెల్లిమ‌ర్ల ఎమ్మల్యే అప్ప‌ల‌నాయుడు దేవాదాయ శాఖ రాష్ట్ర క‌మీష‌న‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ జిల్లా క‌లెక్ట‌ర సూర్య‌కుమారి కొత్త ఆలయాన్ని ప్రారంభించారు.

ఒకే ముహూర్తానికి అంటే స‌రిగ్గా ఉద‌యం 07.37 నిమిషాల‌కు..తిరుప‌తి నుంచీ వ‌చ్చి వేద పండితులు ఆధ్వ‌ర్యంలో విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌,,గోపురంపై క‌ల‌శ స్థాప‌న అలాగే ధ్వ‌జ‌స్థంభం ప్ర‌తిష్ట  మూడు ఒకేముహూర్తానికి జ‌రిగాయి.అదే స‌మ యంలో  కేవ‌లం నెలిమర్ల ఎమ్మ‌ల్యే బడుకొండ  అప్ప‌ల‌నాయుడు  మాత్ర‌మే  గ‌ర్భాల‌యంలో ఉన్నారు.   నిర్ణ‌యించిన ముహూర్తానికి  కొండ వ‌ద్ద కు వ‌చ్చకు..దేవాదాయ శాఖ మంత్రి వ‌చ్చి..లిఫ్ట్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో… గంట ఆల‌స్యంగా..మంత్రి నీలాచ‌లం కొండ‌పైకి వ‌చ్చారు.ఆ త‌ర్వాత మంత్రి బొత్స స‌త్య‌నారాయాణ రావ‌డంతో…అంతా క‌లిసి నీలాచ‌లం కొండ వ‌ద్ద ఏర్పాటు చేసిన శిలా ప‌ల‌కం రిబ్బ‌న్ క‌ట్ చేసారు.

Related posts

వర్షం నీరు నిల్వకుండా పటిష్టమైన చర్యలు

Satyam NEWS

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

Bhavani

ప్రేమించు

Satyam NEWS

Leave a Comment