29.2 C
Hyderabad
November 8, 2024 13: 43 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తాం

GhMC

అక్ర‌మ వెంచ‌ర్లు, నిర్మాణాల‌పై త‌క్ష‌ణ‌మే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం జిహెచ్ఎంసి కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన ప్ర‌జ‌ల నుండి విజ్ఞాప‌ణ‌ల‌ను స్వీక‌రించారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చిత్త‌శుద్దితో కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నిబంధనల గురించి ఫిర్యాదుదారుల‌కు స్ప‌ష్టంగా వివ‌రించాల‌ని తెలిపారు. ఎల్‌.ఆర్‌.ఎస్ అనుమ‌తుల‌కు విరుద్దంగా నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. జిహెచ్ఎంసి ద్వారా కూల్చివేసిన నిర్మాణ స్థ‌లాల్లో తిరిగి ప‌నులు చేప‌ట్ట‌రాద‌ని తెలిపారు. అటువంటి నిర్మాణాల‌ను కూడా వెంట‌నే కూల్చివేయాల‌ని అధికారుల‌కు తెలిపారు.

జిహెచ్ఎంసి ప‌రిధిలోని స‌మ‌స్య‌ల‌పై మాత్ర‌మే విజ్ఞాప‌ణ‌ల‌ను తీసుకోవాల‌ని ప్ర‌జావాణి అధికారుల‌కు సూచించారు. జిహెచ్ఎంసికి సంబంధించని విజ్ఞాప‌ణ‌ల‌ను ఆన్‌లైన్‌లో న‌మోదు చేయ‌డం వ‌ల‌న పెండింగ్ అంశాలు పెరుగుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డినారు. అదేవిధంగా విజ్ఞాప‌ణ‌దారులు కూడా నిరాశ‌కు గుర‌వుతార‌ని తెలిపారు. ఈ అంశంపై విజ్ఞాప‌ణ‌దారుల‌కు ఏ స‌మ‌స్య ఎక్క‌డ ప‌రిష్కారం అవుతుందో వివ‌రించాల‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తుదారుల‌ను తిప్పించుకోరాద‌ని తెలిపారు.

Related posts

రామ్ గోపాల్ వర్మ పై మరో జానపద సెటైర్

Satyam NEWS

నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు గుడ్ న్యూస్

Satyam NEWS

వాగులో చిక్కుకున్న అన్నదాత

Satyam NEWS

Leave a Comment