32.2 C
Hyderabad
May 8, 2024 13: 31 PM
Slider నల్గొండ

కరోనా కాటు ఒకవైపు నిత్యావసరాలు ధరల పెరుగుదల మరోవైపు

#roshapati

కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెట్టుబడిదారుల వ్యామోహంలో చేస్తున్న చర్యల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు  ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వంట నూనె సల సల మరుగుతుందని, వంట గ్యాస్ బండ కుత కుత ఉడుకుతుందని ఆయన అన్నారు. ఇవన్నీ కరోనా వైరస్ కంటే ప్రజలను భయభ్రాంతులకు గుర చేస్తున్నాయని ఆయన అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 30వ, తేదీన జరిగే టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశంలో కరోనా సమయంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులుకు కనీస వేతనం 24000 రూపాయలు 11వ, PRC కి అనుగుణంగా వేతనాలు పెంచేలా తీర్మానం చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా  పెంచాలని కోరారు. ప్రైవేటు టీచర్స్ కు అందించిన విధంగా ఆర్థిక సాయం, బియ్యం వంటి సహకారం,రాష్ట్ర ప్రభుత్వం అందించి ఆదుకోవాలని కోరారు.

బిజెపి ప్రభుత్వం గడిచిన సంవత్సరం లాక్ డౌన్ సమయంలో 20 లక్షల వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, ఇది పెట్టుబడిదారుల అప్పులు ఎగనామం పెట్టిన వారికి జమ చేయడానకి తప్ప సామాన్య నిరుద్యోగులకి, కార్మికులకు ఒక్క రూపాయి అంద లేదని తీవ్రంగా విమర్శించారు. లైట్లు ఆఫ్ చేయడం, పళ్ళాలతో ధ్వనులు చేయమనటం తప్ప మరొకటి లేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యక్షంగా తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు పదివేల రూపాయల చొప్పున పది నెలలు నిత్యవసర వస్తువులు ఇచ్చే విధంగా  ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ, మెరిగ దుర్గారావు,రవి, శ్రీను, కుమారి, చంద్రకళ, సైదులు, వెంకన్న, పుల్లయ్య, నరేష్, దేవకర్ణ, క్రాంతి, నాగరాజు, చంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిఎస్ఎల్వీసి 54 విజయంపై  హర్షం

Murali Krishna

ఇంటరాగేషన్: తట్టుకోలేక ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ఏసీబీ వలలో షాబాద్ ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్

Satyam NEWS

Leave a Comment