29.7 C
Hyderabad
April 29, 2024 07: 08 AM
Slider కరీంనగర్

పీపుల్స్ రైట్:నా మంత్రి పదవి మా అమ్మ ఇవ్వలే

etela rajender the ministry not given by my mother

తానూ అనుభవిస్తున్న పదవి మా అమ్మ ఇవ్వలే హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన బిక్ష. మీరు హక్కుదారులు. నా కార్ పెట్రోలు మీరు పోస్తే నేను తిరుగుతున్నాను అని ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నాను అన్నారు మంత్రి ఈటల రాజేందర్.

హుజురాబాద్ లో “పట్టణ ప్రగతి” కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను హుజురాబాద్ ఎమ్మెల్యేగా 2009లో వచ్చినప్పుడు చెప్పాను.నేను ఎమ్మెల్యే అయ్యింది మోరీలు కట్టియ్యడానికి రాలేదు తెలంగాణ కోసం వచ్చినా అని.20 లక్షల ఫండ్ కోసం ఇబ్బంది పడ్డాము.ఆనాడు ఏం పని చేయకపోయినా ఓట్లు వేసి గెలిపించారు. అందుకే మీ రుణం తీర్చుకోవాలి అనే భావన గుండెల్లో బలంగా ఉండే 2014 వచ్చింది నేను పైసల మంత్రిని అయ్యాను. నీరడి కాడు తన మడిని ఎండగొట్టుకోడు అన్న చందంగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకున్నాము. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు అని నగరం ను తీర్చి దిద్దమని కొరినం.
మురికి పని చేసే వారు అంతా దళిత బిడ్డలు ఉంటారు. వారికి జీతం ఇవ్వక పోతే ఎలా? అని మన మున్సిపాలిటీల్లో రీవోల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేశాను.పందుల బెడద పోగొట్టేందుకు ఎరుకల వాళ్లకు పందులు పెంచేందుకు ప్రత్యేక షేడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. వెంటనే ఆ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ ను కోరుతున్నాం.
జమ్మికుంట పట్టణానికి 20 రోజుల ఒకసారి మంచి నీళ్ళు వచ్చేవి ఈ బాధ తీర్చేందుకు జమ్మికుంట కు 40 కోట్లు, హుజురాబాద్ కి 50 కోట్లు మంజూరు చేశాము. ప్రతి ఇంటికి ప్రతి రోజు నీళ్లు వచ్చేలా చూడాలి.
మీకు నేను ఉన్న, డబ్బులు తెచ్చి పెట్టిన.. ప్లాన్ చేసి ఖర్చు పెట్టాలి.

గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్లు కింద ఉన్నవారికి ముందుగా డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తం 500 ఇల్లు రెడీ అవుతున్నాయి.సొంత జాగల్లో ఇల్లు కట్టుకొనేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం కెసిఆర్ గారితో మాట్లాడుతున్నం. త్వరలోనే ఆ నిర్ణయం కూడా వస్తుంది అని ఆశిస్తున్నాం.హైదరాబాద్ లో ఉన్న మాదిరిగా 2 కోట్లు ఖర్చుపెట్టి స్మశాన వాటిక నిర్మాణం చేసుకున్నాము. ఇంతకు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న మర్చురీల్లో శవాలను ఎలుకలు పీక్క తినేవి, చచ్చిన తరువాత అలా ఉండొద్దు అని 4 ఫ్రీజర్లు ఏర్పాటు చేసిన.

పుట్టక ముందు నుండి చచ్చి పోయిన తరువాత వరకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మనది.ప్రజలు కూడా తమ భాద్యతలు మరువవద్దు. అభివృద్ధికి సహకరించాలి.వచ్చిన నాయకుల మీద, అధికారుల మీద లొల్లి పెట్టవద్దు. వచ్చిన అధికారులను కూర్చో పెట్టి మాట్లాడి పనులు చేయించుకోండి.

నడిచే ఎద్దును పొడస్తారు.పని చేసే వాడి దగ్గరికే ప్రజలు వస్తారు. ప్రతి కౌన్సిలర్ ప్రతి రోజు ఉదయం వార్డుల్లో తిరగాలి.నా మంత్రి పదవి మా అమ్మ ఇవ్వలే, హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన బిక్ష. మీరు హక్కుదారులు. నా కార్ పెట్రోలు మీరు పోస్తే నేను తిరుగుతున్నాను అని ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నాను.

పట్టణాల్లో ఉన్న ఖాళీ జాగాలను సాఫ్ గా ఉంచుకొనే భాద్యత ప్లాట్ ఒనర్లదే. మీరు శుభ్రం చేసుకోకపోతే మున్సిపాలిటి నే చేస్తుంది.. అయిన ఖర్చు వాళ్ళ దగ్గర నుండే వసూలు చేస్తుంది.మున్సిపల్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. విజన్ తో పని చేయండి. మురికి కూపం లా మారితే జబ్బులు వస్తే అయ్యే ఖర్చు పేదవారు భరించలేరు. అందుకే పట్టణం పరిశుభ్రంగా ఉంచండి. అది అధికారుల బాధ్యత అని మర్చిపోవద్దు. చెత్త చెదారం లేని, మురికి నీరు లేని, పచ్చని చెట్లతో ఉన్న పట్టణం తయారు చేయండి.

పల్లెల్లో ఉన్న పేదరికం కంటే, పట్టణ పేదరికం (అర్బన్ పావర్టీ) భయంకరమైనది. పట్టణంలో ఉన్న పేదవారికి చిన్న చిన్న వ్యాపారం చేసేందుకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇస్తాము. ఆపదవస్తే ఆదుకొనే తోడు లేకుండా పోయిన రోజులు వచ్చాయి. అలాంటి వారు నేను ఉన్నాను అని మర్చిపోవద్దు.హుజురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వను. వివక్ష ఉండనివ్వను. ఇది కావాలి అంటే అది చేసి పెడతా.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కార్పొరేటరలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంఆర్ఓ మోసంతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

రామాలయం మూసివేత

Murali Krishna

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

Satyam NEWS

Leave a Comment