40.2 C
Hyderabad
May 2, 2024 18: 57 PM
Slider కర్నూలు

రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా స్పందించరా?

#Rayalaseema

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. చాలా మంది కులం, మతం, పార్టీ చూసుకుని సైలెంట్ అయిపోయారు. రాయలసీమ ప్రయోజనాల కోసం పోరాడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వారు మాత్రం.. పార్టీలకు అతీతంగా పోరాడుతున్నారు.

తాజాగా ఆయన ఓ స్టీరింగ్ కమిటీ పెట్టిపోరాడుతున్నారు. సేవ్ రాయలసీమ నినాదంతో జూలై 28న ఛలో దిల్లీ నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నారు. కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్రతతో రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం నోరు మెదపడం లేదు. అప్పర్ భద్ర కడితే పులివెందులకు నీళ్లు రావని ఇకనైనా సీఎం జగన్ స్పందించి చర్యలు తీసుకోవాలని బైరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చేతకాకపోతే..

తమ సేవ్ రాయలసీమ లో భాగంగా ఢిల్లీకి రావాలని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక మాత్రం రాయలసీమకు చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే జగన్ ఏపీ సీఎం అయ్యాకే రాయలసీమకు మరింత అన్యాయం జరిగిందని బైరెడ్డి చెబుతున్నారు. కర్నూలులో ఏర్పాటు చేస్తామన్న న్యాయ రాజధాని పెద్ద మోసం.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో జిరాక్స్ షాపుల వాళ్లు, చిరుతిండి విక్రయించే వారు ఓ 10 మంది బతుకుతారు.

కానీ మిగతా వారికి ఏ ప్రయోజనం ఉండదని ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు. రాయలసీమకు ఏం చేయకున్నా.. నీళ్లు ఇవ్వకున్నా.. అధికార వైసీపీ నాయకులు గర్జనలు నిర్వహించడం సిగ్గు చేటని బైరెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎన్ని పరిశ్రమలు తెచ్చినా.. ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం అవుతున్నా… కొంత మంది మేధావులు.. రాయలసీమ అన్యాయం అయిపోతుందని రెచ్చిపోతూంటారు. నిజంగా అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెత్తడం లేదు. వీరంతా రాయలసీమకు అసలు అన్యాయం చేసిన వాళ్లన్నవాదనైతే బలంగా వినిపిస్తోంది.

Related posts

మనిషిని చూడు మనిషిలోని అవిటితనాన్ని కాదు

Satyam NEWS

మెగాస్టార్ చిరంజీవిది అద్భుత జ్ఞాపకశక్తి

Satyam NEWS

మునిసిపల్ ఓట్లు మీకు అక్కర్లేదా మంత్రులూ?

Satyam NEWS

Leave a Comment