32.7 C
Hyderabad
April 26, 2024 23: 58 PM
Slider ముఖ్యంశాలు

ఉన్న‌తాధికారుల‌ను కూడా మంచాన ప‌డేస్తున్న క‌రోనా

#VZNMPolice

క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా….వైద్య శాస్త్రంలో ఉన్న ప‌దాల‌న్నీ సామాన్యుడు, అక్షర జ్ఙానం రానివాడు కూడా తెలుసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌తేడాదిలో వ‌చ్చిన క‌రోనా మూలంగా సాధ్య‌మైనంత వ‌ర‌కు  బీపీఎల్ కేడ‌ర్ క‌లిగిన సామాన్య ప్ర‌జానీకం దాని బారిన ప‌డితే  ప్ర‌స్తుతం ఈ సెకండ్ వేవ్ లో రెండున్న‌ర ల‌క్ష‌లు గడిస్తున్న ఉన్న‌తాధికారులు కూడా మంచాన ప‌డుతున్నారు.

ఇక క్వారంటైన్, హోం ఐసోలేష‌న్ అంటూ అందుకు త‌గ్గ మందుల కిట్ ల‌తో ఇళ్లకే  ప‌ర‌మితం అవుతున్నారు.అందుకు నిద‌ర్శ‌నం…ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా. ఇటీవ‌లే జిల్లాకు చెందిన సెంట్ర‌ల్ క్రైమ్ స్టేష‌న్(సీసీఎస్) డీఎస్పీ పాపారావు హాఠాన్మ‌ర‌ణం యావ‌త్ పోలీస్ శాఖ‌నే కుదిసేంది.

ఇక క‌రోనాతో  చికిత్స పొందుతున్న వారిలో విజ‌య‌నగ‌రం ఆర్టీసీ డీఎం బాపిరాజు…జాయంట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు హోం ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.కాగా గ‌డ‌చిన రెండు నెలలుగా  అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా సోక‌డంతో జిల్లా ఎస్పీగా రాజ‌కుమారీ స్వ‌యంగా   జిల్లా ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేసే ప‌నిలో ప‌డుతున్నారు కూడ‌.

అయితే ఎస్పీ కూడా గ‌డ‌చిన వారం రోజుల నుంచీ అటు ఆఫీసుకు గాని,ఇటు ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేసేందుకు రోడ్ల‌పైకి రాక‌పోగా ప్ర‌ధాన జంక్ష‌న్ ల‌లోమైక్ ల ద్వారా అలెర్ట్ చేస్తోంది..జిల్లా పోలీస్ శాఖ‌. దాదాపు 58 మంది  పోలీస్ సిబ్బంది ఈ క‌రోనా సెకండ్ వేవ్ బారిన ప‌డి  హోం ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స పొందుతుండ‌గా అందులో  ఇద్ద‌రు మృతి చెందారు.

గ‌తేడాది దాదాపు 500 మందికి పైగా క‌రోనా సోకి సారి ప‌ల్లి ట్రైనింగ్ సెంట్ర‌ల్ లో చికిత్స పొంది కోలుకున్న సంగ‌తి తెలిసిందే. అయిత ప్ర‌స్తుతం ఈ సెకండ్ వేవ్ క‌రోనా…ఏకంగా ఓ డీఎస్పీని ఇద్దరు కానిస్టేబుళ్ల‌ను తీసుకెళ్లిపోవ‌డం బాధాక‌ర‌ణ‌మైన అంశం. ఏదైనా ఈ క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా..సాక్షాత్ పోలీస్ అధికారిణియే బ‌య‌ట‌కు రాకుండా ఉంటడంతో  త‌స్మాత్ జాగ్ర‌త్త‌ని చెప్ప‌క‌నే చెబుతోంది.

Related posts

సీఏం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోలో సవరణలు

Satyam NEWS

వేసవి పంటలలో నీటి యాజమాన్యం ఇలా చేయాలి

Satyam NEWS

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment