35.2 C
Hyderabad
May 11, 2024 17: 21 PM
Slider ప్రత్యేకం

అమరావతి అంశంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం

Amaravathi1

మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును అత్యధిక ప్రజానీకం ఆహ్వానిస్తున్నదని ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. మూడు రాజధానుల చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదని, సి.ఆర్.డి.ఎ తో అమరావతి రైతుల ఒప్పందం అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.

ఇప్పటికైనా జగన్మోహన రెడ్డి పిచ్చి పిచ్చి ఆలోచనలను విరమించి, నిర్మాణం అవుతూ పూర్తికావాల్సిన భవనముల పనులను పూర్తిచేసి ఉద్యోగులకు, న్యాయమూర్తులు,ప్రజాప్రతినిధులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రహదారులు, డ్రెయినేజీ ,నీటిసరఫరా పనులను చేపట్టాలని ఆయన కోరారు.

విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెట్టబోతున్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక నుంచి అయినా పిచ్చి ప్రేలాపన మానుతారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. హైకోర్టులో రైతులపక్షాన సమర్థవంతంగా వాదనలు వినిపించిన న్యాయవాదులందరికి అభినందనలు తెలిపారు. రెండు సంవత్సరాలు పైగా ఉద్యమాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సజీవంగా నిలబెట్టిన రైతులకు ప్రత్యేకంగా మహిళా సోదరీమణులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేశారు.

Related posts

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడం సరి కాదు

Satyam NEWS

రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలి

Satyam NEWS

శ్రీను మృతికి కారకురాలైన వారిపై చర్యలు తీసుకోవాలి

Bhavani

Leave a Comment