28.7 C
Hyderabad
April 28, 2024 10: 06 AM
Slider ప్రత్యేకం

6,7,8 తేదీలలో మహిళాబంధు

#kcr

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమ, సంరక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ  నేపథ్యంలో ఈ నెల 8 వ తేదీన అంతర్జాతీయ మహిళ దినోత్సవము సందర్భంగా ఈ నెల 6,7,8 తేదీలలో మహిళాబంధు పేరుతో సంబురాలు జరపాలని టి‌ఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది .

ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళ దినోత్సవ సంబరాలు జరపాలని  పిలుపునిచ్చారు. రైతుబంధు, కే‌సి‌ఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన పార్టీ నాయకులు మహిళాబంధు ను కూడా విజయవంతం చేయాలన్నారు.

6 తేదీన కెసిఆర్ చిత్రపటాలకు  రాఖీ కట్టడం తో ప్రారంభమై పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం, – కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం చేయనున్నారు .

అలాగే 7 తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం చేయాలని నిర్ణయించారు.

చివరి రోజైన 8 వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, స్థానికంగా  సంబరాలు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే‌టి‌ఆర్ పేర్కొన్నారు .

Related posts

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

బతుకమ్మ సంబరాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

ఎల్ వి బదిలీతో కేక్ కట్ చేసుకున్న క్రైస్తవ సంఘాలు

Satyam NEWS

Leave a Comment