31.7 C
Hyderabad
May 2, 2024 07: 17 AM
Slider మెదక్

ట్రాఫిక్ పోలీసులకు అందరూ సహకరించండి

#medaksp

ప్రజల ప్రయాణం సాఫీగా సాగడానికి రోడ్లపై నిలబడి విధులు నిర్వహించే పోలీసులకు ప్రతిఒక్కరు సహకరించాలని మెదక్ జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని కోరారు. ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ  ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల సౌకర్యం, రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసినవని తెలిపారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. అలాగే జిల్లాలో చాలా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలపై ప్రయాణిస్తున్నారని అది చట్టరీత్యా నేరమని ఇకనైనా తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని లేని యెడల వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని అన్నారు.

మీరు పాటించాల్సిన అంశాలు

వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడం నేరం.

వాహనం నెంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలి.

నెంబర్ ప్లేట్ పై అసభ్యకరమైన రాతలు రాయడం, నెంబర్ కనిపించకుండా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాము.

వాహనాలకు నెంబర్ ప్లేట్ పెట్టకపోవడం వలన నేరగాళ్లకు అవకాశం కల్పించిన వారమవుతామని ప్రజలు గుర్తించాలి.

మైనర్లు వాహనాలు నడిపితే, సంబంధిత కుటుంబ పెద్దలపై కేసు నమోదు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తప్పించుకునే ప్రయత్నంలో మరిన్ని ఇబ్బందులు తప్పవు.

ప్రజల ప్రయాణం సాఫీగా సాగడానికి రోడ్లపై నిలబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ప్రతిఒక్కరు సహకరించాలి.

వాహనాలపై ప్రెస్, పోలీసు పేరిట స్టికర్స్ పెట్టుకునేవారిని గుర్తించేందుకు త్వరలోనే స్పెషల్ డ్రైవ్.

ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సి.సి. కెమెరాల సహాయంతో, పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ,           జరిమానాల విధింపుకు ఏర్పాట్లు.

తమ పిల్లల జీవన శైలిపై కుటుంబ పెద్దలు దృష్టి పెట్టడం వలన పలు అనర్థాలను నివరించుకోవచ్చు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తిరిగేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయాలని సిబ్బందికి ఎస్.పి. ఆదేశించారు. ప్రధాన రహదారులతో పాటుగా, గల్లీలలో కూడ ఆకస్మిక తనిఖీలు చేయాలని  సూచించారు.

Related posts

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు పెట్టిన కడప వ్యక్తి

Satyam NEWS

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స

Satyam NEWS

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

Satyam NEWS

Leave a Comment