26.7 C
Hyderabad
April 27, 2024 07: 24 AM
Slider ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు పెట్టిన కడప వ్యక్తి

y s jagan 27

ఇది వరకు రోజులు కాదు సోదరా, ఇప్పుడు పోలీసుల కళ్లు మొత్తం సోషల్ మీడియాపైనే ఉన్నాయి. గమనించుకోండి. మీ మీ అభిప్రాయాలను మనసులో దాచుకోండి. బయటకు చెబితే మీ పై పోలీసు కేసు గ్యారెంటీ. కడప జిల్లాలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక వ్యక్తి సిఎం జగన్ కు వ్యతిరేకంగా టిక్‌టాక్ వీడియో పెట్టాడని కేసు పెట్టారు.

మైదుకూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి  సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. అలా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కేసును కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related posts

హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని మున్సిపల్ అధికారులు

Satyam NEWS

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

Satyam NEWS

రాగల 24 గంటల్లో ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

Leave a Comment