38.2 C
Hyderabad
April 28, 2024 19: 57 PM
Slider నల్గొండ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి నందు జరిగిన పత్రిక సమావేశంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం మాట్లాడుతూ ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని,పండగలు, ఇతర కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో మాత్రమే  జరుపుకోవాలని అన్నారు.

రెండోవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారానే కరోనా నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుందని, వ్యాక్సిన్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. భౌతిక దూరం పాటించటం,మాస్కులు ధరించడం, విధిగా సబ్బుతో గాని,శానిటైజర్ తో గాని చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కరోనాను అరికట్టవచ్చు అన్నారు. ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటు 60 సంవత్సరాల పైబడిన వారు,రెండవ డోసు వేసుకొని 9 నెలలు పూర్తి అయినటువంటి వారికి ప్రికాశనరి డోస్ అందించనున్నట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా జనవరి 26 తేదీ నాటికి నూటికి నూరు శాతం లక్ష్యాలు సాదించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమములో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్.పాపిరెడ్డి,జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్, మండల ఆరోగ్య విస్తరణాధికారి గజగంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి

Satyam NEWS

కురుమ, యాదవులను దగా చేస్తున్న కేసీఆర్

Satyam NEWS

సోదరా నువ్వు భ్రమల్లో బాటుకుతున్నావు

Satyam NEWS

Leave a Comment