30.7 C
Hyderabad
April 29, 2024 03: 04 AM
Slider మహబూబ్ నగర్

పది రోజుల్లో ప్రతి ఇంటి ముందు పండ్ల మొక్కలు నాటాలి

#nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటిముందు ఒక మామిడి చెట్టు అధికారులు ముందుండి నాటించాలని జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. 

గురువారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో హరితహారం, జల్ శక్తి అభియాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశీలించినప్పుడు  పచ్చదనం అంతగా కనిపించడం లేదన్నారు. దీనిని అధిగమించడానికి ప్రతి ఇంటి ముందు ఒక పండ్ల చెట్టు ముఖ్యంగా మామిడి చెట్టు నాటించి సంరక్షణ బాధ్యతలు ఇంటి యజమానులకు అప్పగించాలన్నారు. వచ్చే 10 రోజుల్లో ప్రతి ఇంటి ముందు ఒక పండ్ల మొక్క నాటి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. 

అదేవిధంగా అన్నీ ప్రధాన రహదారులపై రెండు వైపులా మూడు వరుసల్లో మొక్కలు కనిపించాలన్నారు.  ఇందులో పండ్ల మొక్కలు ఖచ్చితంగా ఉండాలని 24 రకాల పండ్ల మొక్కల జాబితా అధికారులకు అందజేశారు.  ఇందులో ప్రధానమైనవి జీడీ మామిడి, నల్ల జీడీ, రామాఫలం, బాదం వంటి మొక్కలు సూచించారు. అంతరించిపోతున్న కొన్ని పండ్ల జాతులను నాటి వాటిని భావి తరానికి అందించాలన్నారు.  రాబంధువులు వాటికి సహజమైన ఆహారం దొరక్క జాతి అంతరించిపోయిందని ఉదహరించారు. 

గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్లే  దారులు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, వాటిలో ఏ మొక్కలు ఎన్ని నాటారు, ఇంకా ఎన్ని నాటవలసి ఉన్నది అనే పూర్తి నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు.  వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు 50 శాతం మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి అయిందని మిగిలిన 50 శాతం నెల రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించారు.  బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అచంపేట మినహా అన్ని మండలాల్లో స్థల సేకరణ పూర్తి అయ్యిందని వాటిలోమొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు.

జల శక్తి అభియాన్ పై మాట్లాడుతూ పడిన ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలో ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందుకు ప్రతిఇంటి ముందు ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బావుల పూడిక తీత, చెక్ డ్యామ్ ల నిర్మాణం చేయాలన్నారు.  ఇంకా కొన్ని గ్రామాల్లో వైకుంఠ ధామం ఏర్పాటు పూర్తి కాలేదని అలాంటి గ్రామ సర్పంచులకు షోకాజ్ నోటీస్ లు జారీ చేయాలన్నారు.  గదువులోపు పూర్తి చేయని పక్షంలో సంబంధిత ఎంపిడిఓ పై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, అందరూ ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.

ఔట రాజశేఖర్, సత్యం న్యూస్, కొల్లాపూర్

Related posts

నలంద కిషోర్ మరణం పోలీసులు చేసిన హత్య

Satyam NEWS

పార్ట్ టైం ఉపాధ్యాయులా? హమాలీలా?

Satyam NEWS

బిజినెస్ మెన్ జగన్ రెడ్డి…

Satyam NEWS

Leave a Comment