33.7 C
Hyderabad
April 28, 2024 23: 58 PM
Slider శ్రీకాకుళం

పార్ట్ టైం ఉపాధ్యాయులా? హమాలీలా?

#PartTimeTeachers

ఆంధ్ర ప్రదేశ్ కొన్ని జిల్లాలోని  మండల విద్యా కేంద్రాలలో మండల విద్యాశాఖ అధికారులు లు  పార్ట్ టైం బోధకులను హమాలీలుగా చూస్తున్నారని  రాష్ట్ర పార్ట్ టైం ఉపాధ్యాయుల సంఘం (ఆర్ట్,వర్క్,హెల్త్) అధ్యక్షులు గొల్ల ఆదిశేషయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న పార్ట్ టైం బోధకులను కాంట్రాక్టు, పొరుగు సేవలు ఉద్యోగులను విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, బెల్టులు, యూనిఫామ్ లు అందించాల్సిందిగా వీధులను వేశారు.

ఇందులో భాగంగా మండల కేంద్రాలలో పనిచేస్తున్న పార్ట్ టైం బోధకులను  ఆయా మండల పరిధి లోని పాఠశాలలకు జగనన్న విద్య కానుకను చేర్చాలి. తరువాత పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్  టైం బోధకులను అయిన తాము విద్యార్థులకు పుస్తకాలను అందివ్వగలమని, అలా కాకుండా 40 నుండి 50 కేజీ ల బరువున్న పుస్తకాల కిట్ లను తమతో హమాలీలుగా మోయించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

వివిధ జిల్లాలో రెగ్యులర్ ఉపాధ్యాయుల  నెలకు జీతాలు వేళల్లో, లక్షల లో ఉన్నా వారికి విధులు కేటాయించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు, కేవలం 14,203/ జీతం తో పనిచేస్తున్న తమను వేధింపులకు గురిచేయడం,అలాగే కిట్ లు మొయ్యకుంటే డ్యూటీ సర్టిఫికెట్లు పై సంతకాలు చేయం అని మండల విద్యాశాఖ అధికారులు అనడం సరికాదన్నారు.

ఇప్పటికైనా  సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు స్పందించి పార్ట్ టైం ఉపాధ్యాయుల విధులు కేవలం పాఠశాలలకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని సమగ్ర శిక్షా పథక సంచాలకులు అయిన వెట్రీ సెల్లి దృష్టి కి తీసుకు వెళ్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ సంఘ నాయకుడైన ఆదిశేషయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

ఎక్సప్లనేషన్: ఈ.ఓ వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు

Satyam NEWS

సామాజిక పెన్షన్లు తక్షణమే అందివ్వాలి: చంద్రబాబు డిమాండ్

Satyam NEWS

అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరనున్న అసెంబ్లీ పివిలేజెస్ కమిటీ

Satyam NEWS

Leave a Comment