30.7 C
Hyderabad
April 29, 2024 06: 13 AM
Slider విజయనగరం

గృహసారధులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి

#ysrcp

సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు సమన్వయంతో పని చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందే విధంగా చూడాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విజయనగరం నియోజకవర్గం  కన్వీనర్లు, వాలంటీర్లు, పార్టీ నాయకుల  విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతి కుటుంబానికి ప్రభుత్వంతోపాటు పార్టీ కూడా అండగా ఉంటుందని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసాను  ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.  సమన్వయంతో పని చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తూ, అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖను కూడా అందజేయాలని అన్నారు. విజయనగరంలో జోనల్ వారీగా కన్వీనర్లు, గృహసారదుల సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధిలో పాటుపడుతూ ఉంటే, దానికి సమాంతరంగా వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారథులు పనిచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో పాదయాత్రలో ప్రజా సమస్యలను చూసి, విని, అధికారం చేపట్టిన తర్వాత నవరత్నాలు పేరిట ప్రజలకు సంక్షేమ పలాలు అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని, కూలదోయాలని, పెత్తందారులు, ఆయా మాధ్యమాలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబువి మాయ మాటలని అన్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తన మీటింగ్లకు తీసుకువచ్చి దానిని చూసి బలం అనుకుంటున్నారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ జిల్లాకు, విజయనగరం నియోజకవర్గానికి ఏం చేశారు అని ప్రశ్నించారు. విజయనగరం నియోజకవర్గంలో  గతంలో పనిచేసిన  టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

చంద్రబాబు తన ప్రక్కన అశోక  గజపతి రాజును నిలబెట్టుకొని నీతి నిజాయితీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ప్రభుత్వం వైద్య కళాశాలను మాన్సాస్ కు అప్పగిస్తే, దానికి చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు చేతులెత్తేసిన వైనం నిజం కాదా అని ప్రశ్నించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కు అనుమతులు తీసుకున్నామని చెబుతూ, ఎన్నికల సమయంలో ఆదరాబాదరాగా ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో అప్పటి కేంద్ర పౌర విమాన యాన  శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఎందుకు హాజరు కాలేదని అన్నారు. 

2024 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన సభకు వచ్చే జనాలను అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని, నిజంగా తాము  అనుకుంటే బొబ్బిలి, రాజాం  ప్రాంతాలలో  చంద్రబాబు సభలకు జనం వచ్చేవారా అని అన్నారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నామని అన్నారు . ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. కరోనా సమయంలో అశోక్ గజపతిరాజు, టిడిపి నాయకులు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ  జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలోనే తాను అధికారంలోకి  రాగానే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొస్తానని చెప్పిన విధంగానే ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు.  ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని అన్నారు.

ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలన చూసి , ఏమైనా లోపాలు ఉంటే, ప్రజల అండదండలతో ప్రభుత్వంపై పోరాటం చేయడంలో తప్పులేదు. దానికి భిన్నంగా ఏపీలో ప్రతిపక్షం కొన్ని మాధ్యమాలను వెంటబెట్టుకుని లేనివి ఉన్నట్టుగా అపోహలను సృష్టించి, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళితే ప్రజలు ఆనందంతో బ్రహ్మరథం పడుతున్నారని, ఇవి ప్రతిపక్షాలకు కనపడలేదా అని అన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే విధంగా కుట్రలు చేస్తున్నారని, న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు అని అన్నారు.

ఈ పరిస్థితిని చూసే తాము కన్వీనర్లు, గృహ సారథులు ఏర్పాటుచేసి వాలంటీర్ల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యవస్థను  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు అని  అన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జగన్ పై నిరాధార ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

విజయనగరం సభలో విజయనగరం ఎమ్మెల్యే ఎగిరెగిరి పడుతున్నాడని, భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని చంద్రబాబు అన్నారని, వారికి దమ్ముంటే తను భూకబ్జాకు పాల్పడిన భూమిపై అశోక్ గజపతిరాజు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ తప్పుడు విధానాల వల్లే జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. ప్రజాహిత పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

చంద్రబాబు కుయుక్తులను ఎదుర్కోవాలని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టిన ఘనత, ఉన్నత విద్యకు ప్రాముఖ్యతను ఇస్తున్నారని అన్నారు.

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. సమగ్ర భూ సర్వే కూడా జరుగుతోందని అన్నారు. పీహెచ్సీలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తారని, తన పరిపాలనలో ఏం చేశారు చెప్పరని, ప్రజలను మోసపూరిత మాటలతో, మధ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారని అన్నారు.

నియోజకవర్గ పరిశీలకులు నరేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారదులు సమన్వయంతో పని చేస్తూ  ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ పథకాలు వారికి అందజేస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. నగర పార్టీ అధ్యక్షులు ఆశపూ వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి,  నగరపాలక ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, మండల పార్టీ అధ్యక్షులు నడిపే న శ్రీనివాసరావు, జోనల్ ఇన్చార్జులు అల్లు చాణిక్య, కంటు భుక్త త విటి రాజు,

ముద్దాడ మధు, 12వ డివిజన్ కార్పొరేటర్ రేగాన రూపా దేవి, ఎవర్న కుమారస్వామి, మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడులు  మాట్లాడారు.. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఈసరపు రేవతి దేవి, పార్టీ నాయకులు కేవివీ సూర్యనారాయణ రాజు, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతం  రాజు సుధాకర్, జిల్లా క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం ఎల్ ఎన్  రాజు, పార్టీ జోనల్ ఇన్చార్జులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల  పార్టీ  నాయకులు,అనుబంధ సంఘాల పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు

Bhavani

కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి

Satyam NEWS

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment