38.2 C
Hyderabad
April 28, 2024 20: 39 PM
Slider ప్రత్యేకం

ఉద్యమ పార్టీని విడుతున్న మాజీ మంత్రి జూపల్లి?….ఆ రోజే ప్రకటన!

#ministerjupally

తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి  ఎమ్మెల్యేగా గెలిచి విద్యుత్ చార్జీల సమస్యల పై పోరాటం చేసి జైలుకు వెళ్లారు.

అనంతరం  ఇండిపెండెంట్ గా 2004 ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా 2009లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. దానితో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా జూపల్లి  పని చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  హయాంలో జూపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో జూపల్లి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తన మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. బై ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి మళ్లీ విజయఢంకా మోగించారు. తెలంగాణ మొట్టమొదటి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు.

ఇలా ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో  ఉద్యమాలు చేశారు. 2018లో జూపల్లి 20 ఏళ్ల రాజకీయానికి బ్రేక్ పడింది. ప్రజలు మార్పు కోరుకున్నారు అని అంతా ప్రచారం జరిగింది. కానీ కేవలం తన అనుచరుల  పొరపాట్ల వల్లే ఆయన ఓటమి చూడాల్సి వచ్చింది. స్వయంగా ఈ మాట ఆయననే చెప్పారు.

పంచాయితీ,మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలలో సత్తా చూపిన జూపల్లి

2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక పంచాయతీ  ఎన్నికలు జరిగాయి. జూపల్లి ఓటమి చెందిన కానీ ఆయన అధికార పార్టీలోనే ఉన్నారు. జూపల్లి తన అనుచరులను  టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులను   ఎక్కువ స్థానాలలో గెలిపించారు. అనంతరం ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వలస రావడంతో ఒకే పార్టీలో ఇద్దరు ఉన్నారు.

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో జూపల్లికి ఎలాంటి ప్రోటకల్ లేకున్న తన  అనుచరులకు  బిఫాం లు వచ్చేలా చేశారు. మెరుగైన స్థానాలలో  గెలిపించి సత్తా చూపించారు. ఇక2020లో జరిగిన  కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల దగ్గరికి వస్తె జూపల్లి సింహంలా తన ఉగ్రరూపాన్ని చూపించారు. తన అనుచరులను అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ నుంచి టీఆర్ లోకి  వచ్చిన ఎమ్మెల్యే పై పంజా విసిరారు. అప్పటిలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది.

నియోజవర్గ నాయకులకు ముల్లు లా మారిన జూపల్లి

మొత్తానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి ఎక్కడ కింద పడ్డారో అక్కడనే లేచి నిలబడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై,తన అనుచరులపై పెడుతున్న అక్రమ  కేసుల పై నిలదీస్తూ వచ్చారు. జిల్లా ఉన్నత  స్థాయి పోలీస్ అధికారులను నిలదీస్తూ వచ్చారు. చివరిగా తన మీదనే కేసులు అయ్యాయి. అయన ఎక్కడ వెనుకడుగు వెయ్యలేదు.

నియోజకవర్గ ప్రజల్లో ఆయన మరింత స్థానాని పెంచుకున్నారు. ప్రస్తుతం జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాలలో  అన్ని పార్టీల నాయకులకు ముల్లు లా మారారు. జూపల్లి ఏ పార్టీలకు  పోతారని చర్చ చేసుకుంటున్నారు.  అయితే జూపల్లి ఏ పార్టీలో ఉన్న  ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకులకు  ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తుంది.

ఉద్యమ పార్టీని వీడుతున్న జూపల్లి?

ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి  ఏదైనా ఓ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక విధంగా అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు జూపల్లి అధికార పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఉద్యమ పార్టీలోనే కొనసాగుతున్నాని ఆయన చెప్పుకొచ్చారు.

టిఆర్ఎస్ అధిష్టానం నుండి జూపల్లికి పిలుపు వచ్చినట్లు,ఆయనతో  ఓ సీనియర్ నేత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సర్వేలో ఆయనకు అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది. జూపల్లికి బలమైన హామీ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అనుచరులు మాత్రం ఆ పార్టీలో ఉండవద్దని జూపల్లితో  చర్చించి నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వైపు అనుచరులు మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

జూపల్లి మాత్రం ఉద్యమ స్ఫూర్తితోనే టీఆర్ఎస్ లో ఉండాలని అనుచరులకు ఆదేశించినట్లు తెలుస్తుంది. అదే విధంగా  ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా  వ్యవహరిస్తే  ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా  ఆత్మబలిదానాలతో, ఉద్యమాలతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూపల్లి ఒక నిర్ణయం తీసుకోవచ్చని కూడా చర్చ జరుగుతుంది.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఇంటింటా ఇన్నో్వెటర్ ఆవిష్కరణలు పంపండి

Bhavani

ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్

Satyam NEWS

Triangle love story: బిజెపి… కేసీఆర్…. జగన్ పార్టీ

Satyam NEWS

Leave a Comment