28.7 C
Hyderabad
April 28, 2024 04: 04 AM
Slider తెలంగాణ

శ్రీ లలితా సోమేశ్వరుడి దర్శనం కోసం కాలినడకన జూపల్లి

jupally 12

కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమశిల లోని శ్రీ లలితా సోమేశ్వర స్వామి దర్శనం కోసం మాజీ మంత్రి, టి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు కాలినడకన బయలు దేరారు. సుమారు పది కిలోమీటర్ల మేరకు నడిచి శ్రీ లలితా సోమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అత్యంత పవిత్రమైన కార్తీక పున్నమి నాడు శ్రీ లలితా సోమేశ్వర స్వామి దర్శనం ఎంతో మేలు కలిగిస్తుంది. ఏడవ శతాబ్దంలో సోమశిలలో నిర్మించిన శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయం అత్యంత పవిత్రమైనది. ఏటా ఆరు లక్షల మంది భక్తులు వచ్చివెళ్లే ఈ దేవాలయం అభివృద్ధి చెందితే ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న సమయంలో దీనికి సంబంధించిన ప్రయత్నాలు చేసిన జూపల్లి కృష్ణారావు కొంత మేరకు ప్రగతి సాధించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమ శివుడి ప్రత్యేక పూజలకు తరలి వెళ్లిన జూపల్లి తో బాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కొల్లాపూర్ పురపాలక జూపల్లి సైన్యం తో బాటు ఈ కార్యక్రమంలో పసుపుల నరసింహ్మ, జవాన్ రమేష్ ముదిరాజ్, నాయిమ్, మద్యల రాం దాస్, కె.శ్రీనివాస్, పసుల వెంకటేష్, శేఖర్, బిజ్జ రమేష్, రాఘవేంద్ర, సన్ని, రాజు తదితరులు జూపల్లి వెంట ఉన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో సోమశిల కృష్ణా నది నుండి శ్రీశైలం వెళ్ళడానికి జూపల్లి బోటు మంజూరు చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో ఆ బోటు ఇప్పుడు సిద్ధం అయింది. 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ బోటును ప్రారంభించనున్నారు. ఆ నాడు జూపల్లి తీసుకున్న ఈ నిర్ణయం నేడు కొల్లాపూర్ ప్రాంత పర్యాటక రంగానికి ఎంతో ఉపకరిస్తుంది.

Related posts

అవమాన భారంతో తప్పుకోబోతున్న ఆ ఇద్దరూ

Satyam NEWS

జూన్,జూలై నెలల్లో సమరశీల పోరాటాలు

Bhavani

సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం

Satyam NEWS

Leave a Comment