27.7 C
Hyderabad
April 26, 2024 06: 56 AM
Slider విజయనగరం

సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం

#MLAKolagatla

మధ్య తరగతి కుటుంబాలకు  సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని  ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్,విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయం వద్ద పట్టణ ప్రణాళిక అధికారులు, వార్డు ప్రణాళికా మరియు వెల్ఫేర్ కార్యదర్శులుతో సమావేశమయ్యారు. ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విధానం ప్రకారం మూడు కేటగిరీల లో ఇళ్ల స్థలాలను లే అవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి అందించేందుకు నిర్ణయించిందన్నారు.

ఇందుకోసమై వార్డు ప్రణాళిక కార్యదర్శులు లబ్దిదారుల ప్రాధమిక సమాచారాన్ని సేకరించాలని సూచించారు.150, 200, 240 గజాల చొప్పున మూడు కేటగిరీలుగా యం.ఐ.జి. స్థలాలు పంపిణీ ఉంటుందన్నారు.3 లక్షల నుండి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకం కింద లబ్ధిదారులుగా  గుర్తించనున్నారని తెలిపారు.

ఇందుకోసమే  ప్రాథమిక సమాచార సేకరణకు ప్రతి ఇంటికి వచ్చే వార్డు కార్యదర్శులకు ప్రజలు సహకరించి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్నారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ  ప్లానర్లు వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు, పట్టణ ప్రణాళిక అధికారులు కనకారావు,శ్రీలక్ష్మి ,టీపీఎస్ జనార్ధన్, సర్వేయర్ సింహాచలం, వార్డు ప్రణాళికా కార్యదర్శులు పాల్గొన్నారు.

Related posts

సిఎం సహాయనిధికి గగన్ దీప్ సింగ్ కోహ్లీ విరాళం

Satyam NEWS

సంక్లిష్ట స్థితిలో కార్మికోద్యమాలు

Bhavani

పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు

Satyam NEWS

Leave a Comment