30.7 C
Hyderabad
April 29, 2024 06: 17 AM
Slider ఖమ్మం

రుణ దరఖాస్తు గడువును పొడిగించండి.

#bc

వెనుకబడి తరగతులకు బిసి వృత్తి రుణాల కొరకు ఆన్లైన్ తేదీని జూలై నెల వరకు పొడిగించాలని బిసి హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బిసి హక్కుల పోరాట సమితి సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో మేకల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు శింగు నర్సింహారావు మాట్లాడుతూ బిసి రుణాల పై ఈనెల 20 వ తేదీ వరకు గడువు విధించారని కానీ ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు రావడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో జాప్యం జరుగుతుందని సాంకేతిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయని వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జూలై చివరి వరకు గడువు తేదీని పొడిగించాలని కోరారు.

ఈ రుణ సౌకర్యాన్ని కొన్ని కులాలకే పరిమితం చేయడం సరైంది కాదని బిసి వర్గాలన్నీంటికి వర్తింపజేయాలని ఆయన కోరారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయని ఇంకా చాలా మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టు దరఖాస్తు చేసుకునేందుకు తిరుగుతున్నారని. ఆయన తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను కూడా రూ.

1000 కోట్లకు పెంచాలని, అర్హులైన బిసి లందరికీ బిసి బంధు పథకాన్ని వర్తింపజేసి రూ. 10 లక్షలు అవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సిహెచ్ సీతామహాలక్ష్మీ, నూనె శశిధర్, పగ్గిళ్ల వీరభద్రం, జ్వాలా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కమ్మగూడెంలో విస్తృతంగా ప్రచారం

Bhavani

తెలుగు తల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం

Satyam NEWS

గో గ్రీన్: ప్రతి గ్రామంలో నర్సరీ పనులు పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment