ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..రాష్ట్రంలో అధికార వైకాపా ఘోరంగా ఓడిపోతుందని, గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష టిడిపి అధికారంలోకి వస్తుందని, ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియా టుడే తన సర్వేలో పేర్కొంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఆ సంస్థ ఆరు నెలలోకోసారి సర్వేలు విడుదల చేస్తుంది. దానిలో భాగంగా ఈ సర్వేను నిర్వహించింది. ఇండియాటుడే సర్వేకు అత్యంత విశ్వసనీయత ఉంది. ఈ సంస్థ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సర్వే వాస్తవమైంది. అంతే కాకుండా పలు రాష్ర్టాల్లో ఇంతకు ముందు ఆ సంస్థ నిర్వహించిన సర్వేలు వాస్తవమయ్యాయి. అటువంటి విశ్వసనీయత ఆ సంస్థకు ఉంది. ఇండియాటుడే నిర్వహించిన ఈ సర్వేలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు కలిసి 17 పార్లమెంట్ స్థానాలు సాధిస్తాయని, అధికార వైకాపా 8 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. టిడిపి+జనసేనకు 45శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, కాంగ్రెస్‌కు 2.67శాతం, బిజెపికి 2శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ సర్వే కోసం ఆ సంస్థ 25 పార్లమెంట్ స్థానాల్లోని 35,801 మందితో మాట్లాడింది. ఈ సర్వేను డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు చేపట్టినట్లు పేర్కొంది. అదే విధంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు 10 పార్లమెంట్ స్థానాలు, బిఆర్ ఎస్, బిజెపిలకు చెరో మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది.
previous post