40.2 C
Hyderabad
April 26, 2024 12: 31 PM
Slider శ్రీకాకుళం

జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకకుండా సౌకర్యాలు

SKL Journalists

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల కు కరోనా వ్యాధి సోకకుండా క్వాలిటీ మాస్కులు, శానిటరీ  ఐటమ్స్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని మీడియా ఐక్యవేదిక కోరింది.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ మేరకు నేడు జిల్లా కలెక్టర్ జె.నివాస్ కు వినతి పత్రం సమర్పించారు. కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్యం పై కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని వారు కోరారు.

మీడియా ఐక్య వేదికకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మాస్కులు, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో బాటు కరోనా గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ ను కలిసిన వారిలో జర్నలిస్టుల ఐక్య వేదిక ప్రతినిధులు శాసపు జోగినాయుడు, అల్లు యుగంధర్, శ్రద్ధానంద్ పట్నాయక్, తోట భీమారావు, ఎం.వెంకటేశ్వర రావు, చిట్టిబాబు, టి.ఆనంద్ తదితరులు ఉన్నారు.

Related posts

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

Satyam NEWS

12 భాషల్లో ప్రవేశమున్న ముఖేష్ కుమార్ దర్శకుడిగా “సమంత”

Satyam NEWS

మెగా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే

Satyam NEWS

Leave a Comment