37.2 C
Hyderabad
April 30, 2024 11: 06 AM
Slider హైదరాబాద్

వలస కార్మికులకు ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ

free rice

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో భాగంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో వలస కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేయిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో భాగంగా బుధవారం సికింద్రాబాద్ లోని అంబర్ నగర్ లో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా రేషన్‌ కార్డు లేని నిరుపేద వలస కార్మికులకు ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం, రూ. 500చొప్పున నగదు అందజేశారు.

ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న 34283 మంది వలస కార్మికులకు 411 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేయనున్నట్టు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజన సౌకర్యాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

కరోనాను అడ్డుకునేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని అంబర్ నగర్ వార్డు సభ్యులు నిర్మల ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమలో అంజనీయులు ముదిరాజ్ (అంజూర్), లక్ష్మణ్, జగన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిఎం కేసీఆర్ మార్గదర్శకత్వం వల్లే స్వచ్ఛ అవార్డ్

Satyam NEWS

హైదరాబాద్‌లో ఏడీపీ ఇండియా 23 వ వార్షికోత్సవం

Satyam NEWS

విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా గురాన అయ్యలు

Satyam NEWS

Leave a Comment