38.2 C
Hyderabad
May 2, 2024 19: 32 PM
Slider నల్గొండ

నకిలీ జీరాక్స్ నోట్లను తరలిస్తున్న మూట అరెస్ట్

#fakenotes

నకిలీనోట్లు పట్టుబడటం హుజూర్ నగర్ ప్రాంతంలో సంచలనం కలిగిస్తున్నది. ఈనెల 21న రాత్రి 7 గంటల సమయంలో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎఎస్సై సిహెచ్.లింగారెడ్డి పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాత బస్ స్టాండ్ వద్ద ఈ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి.

అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ పట్టుకొని బస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా అనుమానం వచ్చి అతన్ని పట్టుకుని పోలీసులు విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. అతని పేరు పేరు యేసు అని, తండ్రి బంగారు అని, నివాసం మాచర్ల అని చెప్పాడు. అతని వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో 4,75,000 రూపాయల జీరాక్స్ నకిలీ 500,200 రూపాయల నోట్లు లభించాయి.

అతనికి సహకరించిన గుండ్లపల్లి గ్రామం,నకిరేకల్ కి చెందిన షేక్ ఖాజా తండ్రి షైక్ యాసిన్,తెనాలి కి చెందిన  శ్రీరామ్ విజయ్ బాబు తండ్రి సుబ్బరాజు లను కూడా పట్టుకొని రిమాండ్ కు తరలించారు. నకిలీ కరెన్సీ సరఫరా చేసిన సోర్లం ప్రసాద్ పరారీలో ఉన్నాడు. దొంగనోట్లను కొత్తగూడెంలో ఉన్న సోర్లం ప్రసాద్ కి ఇవ్వటం కొరకు వెళ్ళు చుండగా హుజూర్ నగర్ బస్ స్టాండ్ దగ్గర పెట్టుకోవడం చేయటం జరిగినది.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స్థానిక ప్ర‌తినిధుల స‌హ‌కారం

Satyam NEWS

సెప్టెంబర్ 16వరకు ఇంటర్‌ ప్రవేశాల గడువు

Bhavani

రూ. 7500 కోట్ల‌తో 16 కొత్త‌ మెడిక‌ల్ కాలేజీలు

Sub Editor

Leave a Comment