40.2 C
Hyderabad
May 2, 2024 18: 28 PM
Slider విజయనగరం

విజయనగరం విశాల్ మార్ట్ లో అగ్ని ప్రమాదం..

#vishalmegamart

మంటలను అదుపు చేసేందుకు 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక దశ సిబ్బంది…

విజయనగరం లో కేంద్ర మాజీ మంత్రి అశోక్ బంగ్లా అనుకునే ఉన్న విశాల్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు విజయనగరం తో పాటు విశాఖ, గజపతినగరం, కొత్తవలసల నుంచీ దాదాపు అయిదు ఫైర్ ఇంజన్లు వస్తే గాని.. సాయంత్రానికి మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు 12 గంటల పాటు అగ్ని మాపక సిబ్బంది కష్టపడితే..అప్పుడు మంటలు చల్లారాయి.

వరుసగా నాల్గొసారి అదే విశాల్ మార్ట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శీను ఘటనా స్థలిని పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరగటానికి గల కారణాలను.. వెంటనే తెలుసు కోవాలని అటు అగ్నిమాపక శాఖ ను ఇటు వన్ టౌన్ పోలీసులు ఆదేశించారు. ఇక సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దీపికా..కలెక్టర్ సూర్య కూమారిలు సాయంత్రం విశాల్ మార్ట్ కు చేరుకుని పరిశీలించారు.

ఎస్పీ ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ ఉదయం నుంచీ సాయంత్రం వరకు అక్కడే ఉండి వచ్చే పోయే వాహనాలను క్రమబద్దీకరించారు. డీఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ హరిబాబు .ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదం తో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. అటు వైజాగ్ నుంచీ వచ్చే వాహనాలు.. ఇటు గజపతినగరం నుంచీ వచ్చే వాహనాలు… అక్కడికక్కడే నిలచిపోయాయి.

పైగా కలెక్టరేట్ ఉత్తర భాగాన కే.ఏల్.పురం వద్ద బాణాసంచా విక్రయాలకు ఆర్డీవో అనుమతి ఇవ్వడంతో.. ఆ దారి లో రోడ్ల పైనే బాణాసంచా అమ్మకాలు జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడే ట్రాఫిక్ ఎస్ఐ దామోదర్… తన సిబ్బంది తో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ లో పడ్డారు. ఏదైనా దీపావళి పండగ ముందు రోజు భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలలో ఒకింత భయం పట్టుకుంది.

Related posts

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా పీవీ శతజయంతి

Satyam NEWS

దావోస్ లో ఇద్దరు మిత్రుల కథ…

Satyam NEWS

బిగ్‌బాస్‌3 నుండి శిల్పచక్రవర్తి ఔట్‌ ?!

Satyam NEWS

Leave a Comment