మాజీమంత్రి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరగడంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి అంటూ ఫేస్ బుక్, వాట్సప్ లలో కొందరు దుండగులు అసత్య ప్రచారం చేశారు. ఇది నిజమే అనుకుని ఆందోళన చెంది మాణిక్యాలరావు కార్యాలయానికి ఆయన అభిమానులు ఫోన్లు చేశారు. ఓ టీవీ చానెల్ లోనూ వచ్చిందంటూ మరో తప్పుడు ప్రచారానికి దుండగులు ఒడిగట్టారు. తప్పుడు ప్రసారం చేసిన వ్యక్తులు ఓ పార్టీకి చెందిన వారిగా బిజెపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ పార్టీ నేతలకు మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు మద్య తీవ్రస్థాయిలో విమర్శ, ప్రతి విమర్శలు చెలరేగాయి. ఇందులో భాగంగానే ఈ తప్పుడు ప్రచారం జరిగిందని బిజెపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై వచ్చిన తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించిన మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు హైదరాబాద్ సైబర్ క్రైం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
previous post
next post