38.2 C
Hyderabad
April 29, 2024 21: 29 PM
Slider ఖమ్మం

వామపక్షల పోరాట ఫలితమే రైతు రుణమాఫీ

#CPI

రైతులకు రుణమాఫీ చేయాలని అనేక దఫాలుగా వామపక్ష పార్టీలు ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహించాయని, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగానే రైతు రుణమాఫీ జరిగిందని సిపిఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం అసెంబ్లీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ చేయాలని పోరాటాలు నిర్వహించామని తెలియజేశారు.

ఈ నెలలో కూడా రైతుల రుణమాఫీ కోసం పోరాట కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. రైతు రుణమాఫీని ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ ఈ రుణమాఫీ వల్ల పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. రుణమాఫీ ఆలస్యం చేయడం వల్ల రైతులకు అసలుతో సమానంగా వడ్డీ కూడా పెరిగిందని అన్నారు.

సకాలంలో రుణమాఫీ జరగకపోవడం వల్ల రైతులు కొత్త రుణాలు తీసుకోవడానికి అవకాశం కూడా లేకుండా పోయిందని, దానివల్ల ప్రైవేటు వడ్డి వ్యాపారుల వద్ద నుండి అధిక వడ్డీలకు రైతులు అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

దీనివల్ల రైతులు అప్పుల భారం మరింత పెరిగిందని తెలిపారు. ఆలస్యంగా చేసిన న్యాయమైనా అన్యాయంతో సమానమేనని వారు పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts

శాల్యూట్: సేవకు సై అంటున్న సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

జగన్ రెడ్డికి తలపోటు: ఎమ్మెల్యేగా పోటీకి బైరెడ్డి సిద్దం

Satyam NEWS

ఉపశమించిన గోదారమ్మ ఊపిరి పీల్చుకున్న రెవిన్యూ అధికారులు

Satyam NEWS

Leave a Comment