39.2 C
Hyderabad
May 3, 2024 11: 53 AM
Slider వరంగల్

రైతు బిడ్డనని చెప్పుకోవడానికి సంకోచించకండి

#Subregistrar Taslima

అన్నదాతకు అండగా నిలుస్తూ భవిష్యత్తులో ఆకలితో చనిపోయే రోజులు రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా రామచంద్రపూర్, గుత్తూరు  తండాలో  పొలంలో కూలీలతో కలిసి ఆమె వరి కోత కోశారు.

అనంతరం తస్లీమా మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నవారే కాని, రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి నామోషీ అనుకుంటారు, కోట్ల మంది ప్రజల ఆకలిని తీర్చే రైతు బిడ్డగా పుట్టడం గొప్ప వరమని,అలాంటి రైతు బిడ్డనని చెప్పుకోవడానికి సంకోచించకుండా, నేను దేశానికి అన్నం పెట్టే రైతన్న బిడ్డనని సగర్వంగా చెప్పుకోవాలని అన్నారు.

రైతు విలువ తెలియక చాలా వారిని చిన్న చూపు చూస్తున్నారని, రైతు ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పడానికి ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తున్నాని తెలిపారు.

Related posts

ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలి

Bhavani

దగ్గు మందును మత్తు మందులా అమ్ముతున్నాడు

Satyam NEWS

అక్సిడెంట్:అమెరికాలో హైదరాబాద్‌ దంపతుల మృతి

Satyam NEWS

Leave a Comment