40.2 C
Hyderabad
April 28, 2024 15: 41 PM
Slider మహబూబ్ నగర్

రైతులను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

#BJP Nagarkurnool

రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని, రైతు రుణమాఫీలు వెంటనే అమలు పరచాలని భారతీయ జనత పార్టీ కొల్లాపూర్ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు కొల్లాపూర్ RDO ఆఫీస్ లోని ఇంచార్జ్ ఎస్ ఎం హుసేన్ కు వినతిపత్రం అందచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రైతు బందు పథకం కింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారో అదే ప్రాతిపదికన ప్రస్తుతం, కొత్తగా అర్హులైన  రైతులందరికీ 5000/- రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ రైతులందరికీ లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని, అధికారం చేపట్టి 18  నెలలు గడిచినా ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని బిజెపి ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, అందుకే లక్ష రూపాయలు కలిగిన రైతు రుణాలను వెంటనే మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలను ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని భారతీయ జనత పార్టీ ప్రభుత్వానికి విన్నవించింది.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ధనుజాయ్ గౌడ్, BJYM జిల్లా కార్యదర్శి కాశిపురం మహేష్, రమేష్ రాథోడ్, కురుమూర్తి, శివశంకర్, హరీష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

T20: రెండో విజయాన్ని అందుకున్న టీమిండియా

Satyam NEWS

రాజ్యాంగాన్ని అవమానించే వారిని తరిమికొట్టండి

Satyam NEWS

పి ఎం ఇ జి పి పై నాగర్ కర్నూల్ లో అవగాహన సదస్సు

Satyam NEWS

Leave a Comment