30.3 C
Hyderabad
March 15, 2025 10: 26 AM
Slider హైదరాబాద్

పేదలకు సోనియాగాంధీ రేషన్ కిట్ల పంపిణీ

#Sonia Gandhi Ration Kits

హైదరాబాద్ నగరం లోని నిజమైన నిరుపేద కుటుంబాలను గుర్తించి ఏఇసిసి మైనారిటీ విభాగం జాతీయ కొ-ఆర్డినేటర్ ఎస్ జెడ్ సయీద్ రోజువారీగా సోనియాగాంధీ రేషన్ కిట్లను పంపిణీ చేశారు. నగరం లోని సన్ సిటి ,అత్తాపూర్,  గాంధీ నగర్, చంచల్ గూడా, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా సయీద్ మాట్లాడుతూ 10 కిలోలు బియ్యం, 2 కిలోలు ఆటా, ఒక లీటరు నూనె, చక్కెర, టీ, ఉల్లిపాయ మొదలైన వాటితో పాటు మొత్తం 15 కిలోల రేషన్ కిట్స్‌ను అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలకు ఉపశమనం కల్పించడంలో బిజీగా ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ఈ సందర్బంగా  ప్రశంసించారు. వలస కార్మికులకు అవసరమైన సహాయం అందించినందుకు, స్వరాష్ట్రాలకు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.

ధనవంతులు, పరోపకారులు మానవతా దృక్పదం తో అవసరమైన సమయంలో నిజమైన నిరుపేదలకు ఉపశమనం కలిగించడానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ పై భిన్న వివరణలు ఎందుకు?: బీజేపీ

Satyam NEWS

కొట్టుకు చస్తున్న మూవీ ఆర్టిస్ట్‌ (మా) లు

Satyam NEWS

Leave a Comment