42.2 C
Hyderabad
April 26, 2024 18: 44 PM
Slider గుంటూరు

రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల నిరసన

#protest

చీరాల ఓడరేవు నుండి నకరికల్లు వరకు రహదారి విస్తరణ పనులు లో భాగంగా నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసానిపల్లి నుండి జొన్నలగడ్డ, గుంట గార్లపాడు, ఇస్సపాలెం, రావిపాడు గ్రామాల రైతుల పొలాల గుండా ప్రభుత్వం బైపాస్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా బాధిత రైతులంతా నినదించారు. NH167A ని మునిసిపల్ పరిధికి వెలుపల బైపాస్ నిర్మించాలని జెసి ముందు ముక్తకంఠంతో చెప్పారు.

ఈరోజు అభ్యంతరాలు తీసుకోవటానికి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ బాధిత రైతులకు నోటీసులు పంపగా రైతులంతా నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో సమావేశానికి హాజరయ్యారు. మూడు నెలల క్రితమే మా అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువచ్చామని ఎంపీ, ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు, బాధిత రైతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని అప్పటివరకు సర్వే పనులు చేయరని హామీ ఇచ్చారు.

అయితే ఇంతవరకు కలెక్టర్ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించలేదని, కలెక్టర్ కి తాము ఇచ్చిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని, ఇప్పుడు అభ్యంతరాలు చెప్పడం ఏమిటి అని జెసి ముందు రైతులంతా డిమాండ్ చేశారు. దానికి అధికారులు నుండి సమాధానం రాలేదు. ఈ నెలాఖరులో ఢిల్లీలో దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నందున హడావిడిగా రెవెన్యూ వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా రైతులు చెప్తున్నారు.

అధికారుల తీరును నిరసిస్తూ రైతులు సమావేశం నుంచి బయటికి వచ్చారు. సమావేశానికి ముందు రైతులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి విగ్రహం వద్ద బైపాస్ నిర్మాణానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, పిడిఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు రైతుల డిమాండ్లకు మద్దతు తెలియజేసి ధర్నాలో పాల్గొన్నారు.

Related posts

రైతుకు మేలు చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

Bhavani

నరసరావుపేటలో టీడీపీ జెండా కూల్చివేత

Satyam NEWS

Leave a Comment