38.2 C
Hyderabad
April 29, 2024 14: 42 PM
Slider నల్గొండ

రైతుకు మేలు చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ

#TRS MP

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని చూసి ఓర్వలేక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నకిరేకల్, హుజూర్ నగర్  శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి లతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి పంట మార్పిడి విధానాన్ని అమల్లోకి తేవాలని ఆలోచిస్తుంటే దాన్ని కాంగ్రెస్ వాళ్లు విమర్శించడంలో అర్ధం లేదని అన్నారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.

కరోనా నేపధ్యంలో ఐకెపిల ద్వారా రైతు ఇంటి దగ్గరే పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతుల కోసం రుణమాఫీ, ఉచిత కరెంటు, పంటకు గిట్టుబాటు ధర, సాగు నీటి ప్రాజెక్టులు ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నారని తెలియజేశారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, రోల్ మోడల్ ముఖ్యమంత్రి గా కేసీఆర్ నిలిచాడని ఆయన కొనియాడారు. కాగా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని లింగయ్య యాదవ్ విమర్శించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి విలువలు లేవు

ఉత్తమ్ కుమార్ రెడ్డి విలువలు లేని రాజకీయాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యాడని హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి కేసీఆర్ ఆదర్శ నీయమైన వ్యక్తి గా నిలిచారని అన్నారు. తెలంగాణ ఒకవైపు గణనీయంగా అభివృద్ధి లోకి దూసుకెళ్తుంటే ఉత్తమ్ పసలేని విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు.

సాగు నీటి ప్రాజెక్టు లు పూర్తి అయిన నేపధ్యంలో వచ్చే వర్షా కాలంలో సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల ఎకరాలు సాగులోకి రాబోతున్నాయని సైదిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి పాల్గొన్నారు. ఇంకా, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, పిఏసీఎస్ వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు పాటి మాధవ రెడ్డి, పొన్నం లక్ష్మయ్య, గుండెబోయిన సైదులు, బొబ్బల శివశంకర్, దాసరి నరసింహా, జిట్టా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆంక్షల మధ్యే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు ఇక లేరు

Satyam NEWS

పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య నేతలకు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment