37.2 C
Hyderabad
May 2, 2024 11: 56 AM
Slider ముఖ్యంశాలు

రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు బంద్ చేయాలి

#pocharam

రైతు బంద్ ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు బంద్ చేయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సంక్షేమం చాలా ముఖ్యమని, ఈ రెండింటిలో ఏది కుంటు పడినా పరిపాలనకు చెడ్డపేరు వస్తుందన్నారు. ఓట్ల కోసమే హామిలిచ్చి తర్వాత మర్చిపోయిన వాళ్ళు నిజమైన పరిపాలకులు అనిపించుకోరని తెలిపారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ప్రజలు, రైతుల అవసరాలను గుర్తించి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారన్నారు. అందుకే రాష్ట్రం దుర్భిక్షం నుంచి సుభిక్షానికి, సంక్షోభం నుంచి సంక్షేమానికి మారిందన్నారు. రాష్ట్రంలో పదేళ్ళలో 1.50 కోట్ల ఎకరాల భూమికి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం ద్వారా పంపిణీ చేశారన్నారు.

ఇది నిరంతరం అమలయ్యే పథకమని, ఎన్నికల కోసమే తెచ్చింది కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మానిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు రైతు బంధు పథకాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం రైతుల పట్ల వారికి ఎంత కోపం ఉందొ అర్ధం అవుతుందన్నారు. దీనిని రైతు వ్యతిరేక చర్యగా భావిస్తూ ఖండిస్తున్నామన్నారు. పదేళ్ళలో 73 వేల కోట్ల రూపాయలు 1.05 లక్షల మంది రైతులకు రైతు బంధు ద్వారా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రేపు మిషన్ భగీరథ, పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి పథకాలు కూడా ఆపేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.

60 ఏళ్లలో మీకు చేతకాక ఇలాంటి పథకాలీ అమలు చేయడానికి బుద్ది, జ్ఞానం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కరెంట్, బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం అంటూ అలవికాని హామిలిచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేసారని విమర్శించారు. అక్కడి ప్రజలు తెలంగాణకు వచ్చి తాము మోసపోయామని, కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్తున్నారన్నారు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి అని సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. వచ్చే నెలలో ఎన్నికల కోడ్ ఉందని రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో రైతులు పెట్టుబడి పెట్టె మాసం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.

Related posts

పుంగనూరులో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

Satyam NEWS

KCR అనుచిత వ్యాఖ్యలకు రగులుకుంటున్న కార్చిచ్చు

Satyam NEWS

పార్టీలకు అతీతంగా కుల సంఘాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

Leave a Comment