29.7 C
Hyderabad
May 3, 2024 03: 27 AM
Slider మహబూబ్ నగర్

రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

jaipalyadav 201

రైతు సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క  జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

వరి ధాన్యం ఏ గ్రేడ్ కు రూ.1835, బి గ్రేడ్ కు రూ. 1815 క్వింటాలుకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతు సోదరులు మధ్య దళారీలను ఆశ్రయించకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్దిపొందాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత కురుమయ్య, మార్కెట్ చైర్మన్ బాలయ్య , వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, గ్రామ సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కాయితి ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో బాలచంద్ర సుజన్, ఎడిఎ వెంకటేశ్వర్లు, ఏవో శ్రీలత, మహిళా సంఘం నాయకురాలు రేష్మ బేగం, చూసి రాజేశ్వరి , అఫ్రా బీన్, శోభారాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కల్వకుర్తి పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ కు రూ లక్ష అందజేశారు. Corona నిర్మూలనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేష్ కుమార్, తాసిల్దార్ రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్యం, సీఐ ఆవుల సైదులు, కమిషనర్ జాకీర్ అహ్మద్, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

సందీప్ రెడ్డి  మరణం తీరని లోటు

Satyam NEWS

అలెర్ట్ రిటర్న్:ముంబై- హైదరాబాద్‌ ప్లేన్ ఇంజిన్‌లో లోపం

Satyam NEWS

ఎమ్మెల్యే గూడెం కొడుకు మృతి

Bhavani

Leave a Comment