30.7 C
Hyderabad
April 29, 2024 06: 55 AM
Slider తెలంగాణ

టేకు లక్ష్మి కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలి

bc leaders

ఆసిఫాబాద్ ప్రాంతంలో అత్యంత అమానవీయంగా  టేకు లక్ష్మి పై జరిగిన అత్యాచారం హత్య కేసు విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని జాతీయ సంచర జాతుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుండ్లపల్లి కోరారు. ఈ మేరకు MBC కార్పొరేషన్ చైర్మన్ తాడురి శ్రీనీవాస్ కు ఆయన వినతి పత్రం అందచేశారు.

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సంచరజాతుల సంఘం అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన MBC కార్పొరేషన్ చైర్మన్ తాడురి శ్రీనివాస్ దీనికి సానుకూలంగా స్పందించారు. దళిత సంచార జాతుల ఆడబిడ్డ అయిన టేకు లక్ష్మికి జరిగిన అన్యాయం కొద్ది మేరకు అయినా సరిదిద్దాల్సిన అవసరం ఉందని సత్యనారాయణ తెలిపారు.

టేకు లక్ష్మి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టి ఉంచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. జాతీయ సంచార జాతుల సంఘం చేసిన డిమాండ్ మేరకు సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని తాడూరి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

అదేవిధంగా ప్రభుత్వం గత సంవత్సరంలో జారీచేసిన 16 జీవో  MBC లిస్ట్ లో  సంచార కులాలు పూసల, వడ్డెర మేదరి, బోయ  లేకపోవటం మూలన జరిగిన నష్టాన్నికూడా అయన కు వివరించారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు.  

Related posts

ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గృహా నిర్బంధం

Satyam NEWS

పరీక్షలు రాయకుండానే పాస్ చేసిన సీబీఎస్ఈ

Satyam NEWS

పానకాలస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment