33.7 C
Hyderabad
April 30, 2024 01: 56 AM
Slider తూర్పుగోదావరి

సేవలే సంతృప్తినిస్తాయి: పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్

#padmashreesankuratrichandrasekhar

చేసిన సేవలు మానవ జీవితంలో ఎంతో సంతృప్తినిస్తాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ అన్నారు. భారతదేశంలోని సుమారు 90 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి విద్య, వైద్యం, తాగునీరు ఇతర మౌలిక సౌకర్యాలు లేకుండా జీవనం సాగించడం పట్ల తాను ఎంతగానో ఆవేదన చెందినట్లు ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మంగళవారం రాత్రి కాకినాడలోని రామారావు పేట లో ఉన్న లైన్స్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ చంద్రశేఖర్ కు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను విద్య, వైద్యం నిమిత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. తనకి ఈ పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ పురస్కారం తాను చేసిన సేవలకు చెందుతుందని, తనను ప్రోత్సహించిన వాళ్లకు ఆయన అభినందనలు తెలిపారు. తాను ఏదో సేవ చేయాలనే లక్ష్యంతో నాడు ఆసుపత్రిని, విద్యాలయాన్ని ప్రారంభించి ఎంతో మందికి సేవలందించినట్లు చెప్పారు. అందువలన తాను ఈ పురస్కారానికి అర్హులైనట్లు పేర్కొన్నారు. సేవకులు ఇదే విధానాన్ని అలవర్చుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తాను ఆసుపత్రిలో కంటికి వైద్యం చేసిన రోగి ఇంటికి వెళ్లేటప్పుడు బయటకు వచ్చి చుట్టూ ఉన్న ప్రకృతి, వ్యక్తులను చూసినప్పుడు వారు పొందుతున్న అనుభూతిని చూసి ఎంతగానో సంతృప్తి చెందుతున్నట్లు సంకురాత్రి చెప్పారు. చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని ఇదేనా నేను తెలుసుకున్నదన్నారు. అనంతరం డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ను శాలువులతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ అధ్యక్షుడు దాకమర్రి శంకర్, కార్యదర్శి బాదం బాలకృష్ణ,  కొల్లేపల్లి మురళీకృష్ణ, దాసరి సాయి కృష్ణ, పైడా శ్రీరామ్, జీవీఎస్ గాంధీజీ, పైడా సోమేశ్వరరావు, పైడా వెంకటనారాయణ, డి విజయలక్ష్మి, అషిక, లయన్స్ క్లబ్,  ఐ బ్యాంక్, కిరణ్ కంటి ఆసుపత్రి చెందిన వైద్యులు, సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

పరిశోధన అంశాలు: చదవడం, రాయడం ఎలా?

Satyam NEWS

NRI TDP విభాగం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు

Satyam NEWS

వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే వ్యవసాయ అధికారులకు అవమానం

Satyam NEWS

Leave a Comment