Slider తూర్పుగోదావరి

సంక్షేమానికి ములస్తంబాలు…వలంటీర్ లకు పురస్కారాలు…

#viswaroop

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లు మూలస్తంభాల వంటివారని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ తేతల వనజా నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ అధ్యక్షతన గ్రామంలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటరీ లకు పుష్కరాలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ కన్వీనర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటరీలనుద్దేశించి మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర మరువలేనిదన్నారు.

ప్రజాసంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పైనుండి కింద స్థాయికి వచ్చే సరికి లబ్ధిదారులకు మొండిచేయి మిగిలేదన్నారు. అటువంటి దుస్థితి నుండి రాష్ట్ర ప్రజలకు రక్షించేందుకు లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో వాలంటీర్లు కీలకపాత్ర వహించడం చరిత్రలో కొత్తమలుపు అన్నారు.

ఈ సందర్భంగా రాయవరం సచివాలయం రెండు పరిధిలో  సేవ వజ్ర  బి.రాజబాబు, సోమేశ్వరం రెండు జే. శ్యామ్ స్టీఫెన్, సేవ రత్నా రాయవరం రెండు జే. మహేష్ బాబు, సోమేశ్వరం రెండు కే మణి, వెడురుపాక వి. వాని త్రివేణి గౌరీ లకు పురస్కారలు మినిస్టర్ విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట చేతులమీదుగా అందజేసారు.

ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రాష్ట్ర వైయస్సార్ సిపి ప్రధాన కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులు సత్తిబాబు, మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి,  ఏఎంసి డైరెక్టర్ తేతలసుబ్బరామిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ఆర్గనైజర్ సెక్రటరీ కొవ్వూరు త్రినాద్ రెడ్డి, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, మండపేట రూరల్ ఎం పి పి ఉండమట్ల శ్రీను, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్, రాయవరం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు మంతెన అచ్యుత రామరాజు, పడాల కమలా రెడ్డి, కొల్లు రాంబాబు, తమలపూడి గంగాధర్ రెడ్డి, రాయవరం ఎంపిటిసి గంటి రోజా, మండల కో ఆప్షన్ సభ్యులు పోలిమాటి జేమ్స్ శ్యామ్ సుధాకర్, ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను,12 గ్రామలా నుండి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది,  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

రేపు ఒంగోలులో ఆత్మగౌరవ గర్జన సభ

Bhavani

విఆర్ఎ ల ఉద్యమానికి సి ఐ టి యు సంపూర్ణ మద్దతు

Satyam NEWS

గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment