38.2 C
Hyderabad
April 27, 2024 15: 14 PM
Slider మహబూబ్ నగర్

ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు

#wanaparthySP

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పి రామదాసు తేజవతు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన అర్జిలను జిల్లా అడిషనల్ ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రజావాణిలో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల, మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అడిష్నల్ ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణిలో
భూ తగాదాలు 08,
భార్యాభర్తల పిర్యాదులు 05,
పరస్పర గొడువలు 02,
మొత్తం 15 పిర్యాదులు వచ్చాయి.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

చక చకా అంబీర్ చెరువు సుందరీకరణ పనులు

Satyam NEWS

ప‌శు సంప‌ద‌ను మరింత పెంచుకునే ప్రణాళికలు సిద్ధం చేయాలి

Satyam NEWS

క‌రోనా రోగుల‌కు ఉత్త‌మ సేవ‌లందించ‌ట‌మే ల‌క్ష్యం

Satyam NEWS

Leave a Comment