33.7 C
Hyderabad
April 29, 2024 02: 44 AM
Slider నల్గొండ

రాబోయే పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి

#Chiyala Municipality

రాబోయే పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలని నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మునిసిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి కోరారు. మునిసిపల్  కార్యాలయం లో  ఆయన అధ్యక్షతన శుక్రవారం అఖిల పక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించే వినాయక చవితి, గోకులాష్టమి, బోనాలు, మొహారం ( పీర్ల) ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ ఇంటి దగ్గరే జరుపుకోవాలని అన్నారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కరోనా విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో పండుగలు నిర్వహించారాదని ఆయన సూచించారు.

ఇంట్లో జరుపుకోవాలని, కరోన నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అఖిలపక్షం సమావేశంలో ఈ సూచనలకు అందరూ మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో  చిట్యాల ఎస్ ఐ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ రాగ్యా నాయక్,  వైద్యాధికారులు సమీయుల్లా, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన  నాయకులు బెల్లి సత్తయ్య, పాటి మాధవరెడ్డి,   కోనేటి కృష్ణ, జమీరొద్దీన్ పాల్గొన్నారు.

ఇంకా, రుద్రవరం పద్మ, పోకల దేవదాస్, జమాండ్ల జయమ్మ, జిట్టా బొందయ్య, చికిలమెట్ల అశోక్ ,షేపురి యాదయ్య,నారగొని శ్రీను,పల్లె వెంకన్న,శీల రాజయ్య,కందాటి రమేష్ రెడ్డి, శుకురు, ఇబ్రహీం, ప్రవీణ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

19 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభం

Satyam NEWS

భార్య ఫిర్యాదుతో భర్త మనస్థాపం: ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment