38.2 C
Hyderabad
April 29, 2024 12: 08 PM
Slider ఖమ్మం

ప్రొఫెసర్‌ జి.హర గోపాల్‌పై కేసులు పెట్టటం దుర్మార్గం

#G. Hara Gopal

విద్యా వేత్తలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ పద్మజషాతో పాటు ప్రముఖ కళాకారులు, సామాజిక కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ‘‘ఉపా’’ కింద కేసు నమోదు చేయటం తీవ్ర విస్మయం కలుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జి.హరగోపాల్‌పైన రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు నమోదవ్వటం దుర్మార్గమని బాధ్యతారహితంగా కేసులు నమోదు చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిరచారు. ‘‘ఉపా’’ చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సింది కాదని రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

ఉపా చట్టాన్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.
హరగోపాల్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అనేక పత్రికలకు వ్యాసాలు రాస్తూ రచనలు కొనసాగించారని, అలాంటి పుస్తకాల్లో ఆయన పేరు వున్నదని పోలీసులు చెబుతూ కేసు నమోదు చేయటం దుర్మార్గం అన్నారు. తెలంగాణలో అన్ని అంశాలపై అవగాహన వుండి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి హరగోపాల్‌ అని పేర్కొన్నారు.

తెలంగాణ సమకాలీన సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేశారన్నారు. అలాంటి హరగోపాల్‌పైన ఉపా కేసు పెట్టి వేధించటం పాలకుల దుశ్చర్యకు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రజాస్వామికవాది అయిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై పోలీసులు కేసు పెట్టటం అన్యాయమని, ఆయనతోపాటు ప్రొఫెసర్‌ పద్మజాషా తదితరులపై కారణం లేకుండా కేసులు పెట్టటం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే వారిపై పోలీసు నమోదు చేసిన కేసును ఉపసంహరించుకొనేందుకు చర్యలు తీసుకోవటం తెలంగాణ ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా వుంటుందని నున్నా సూచించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ తెస్తున్న ఇలాంటి దుర్మార్గమైన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ కేంద్రంలోని బిజెపికి సహకరించే వైఖరి కనిపిస్తుందని, వెంటనే పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

Related posts

దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS

లంచం తీసుకున్న స్పెషల్ డిప్యూటి తహశీల్దార్ జైలు శిక్ష

Bhavani

బ్రోకర్ల చేతిలో అంబర్ పేట్ మండల్ కార్యాలయం 

Satyam NEWS

Leave a Comment