38.2 C
Hyderabad
April 29, 2024 20: 04 PM
Slider పశ్చిమగోదావరి

ఇసుక మాఫియాపై ఎస్ఈబి అధికారుల దాడులు

#pedavegi

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అనునిత్యం సాగుతున్న ఇసుక మాఫియా దోపిడిపై ఎస్ ఈ బి  అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నడిపల్లిలో తమ్మిలేరు నదీ పరివాహక ప్రాంతాన్ని ఎస్ ఈ బి  అధికారులు నేడు పరిశీలించారు. రైతులు తమ పొలాల కు ప్రమాదం వాటిల్లేలా ఇసుక తవ్వుతున్నారని స్పందన లో ఇచ్చిన ఫిర్యాదు పై అధికారులు ఈ పరిశీలన చేశారు. ఇదిలా ఉంటే నడిపల్లి ఇసుక రాంప్ నుండి  జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఎన్నో ట్రక్కుల ఇసుక అధికారికం గా తరలించారు. అనధికారికంగా ఎన్ని ట్రక్కులు తరలిపోయింది. కనీసం రోజుకు 200 ట్రక్కుల ఇసుక నడిపల్లి రాంప్ నుండి తరలిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

జగనన్న ఇళ్ల నిర్మాణాలకు నడిపల్లి నుండి ఎన్ని ట్రక్కుల ఇసుక  అధికారుల అనుమతులతో  జగనన్న ఇళ్లకు చేరింది అనేది అధికారులు విచారణ జరపాలని నడిపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. నడిపల్లి, చుట్టూ ప్రక్కల గ్రామాలలో కొంత మంది 100 నుండి 200 ట్రక్కుల వరకు ఇసుక ను తమ స్థావరాల కు తరలించి గుట్టలుగా పోగేసుకుని దాస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాంప్ నుండి ట్రాక్టర్ ల ద్వారా తరలించిన ఇసుకను, ఇక్కడ తవ్విన ఇసుక  ఎంత అనే లెక్కలు అనుభవజ్ఞులైన సివిల్ ఇంజనీర్ ల చే లెక్కలు కట్టిస్తే జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఎన్ని ట్రక్కులు వెళ్ళింది అనే వివరాలు పరిశీలిస్తే జగనన్న ఇళ్ల ముసుగులో ఎంత ఇసుక బ్లాక్ మార్కెట్ కి తరలిందో వెలుగు చూసే అవకాశాలున్నాయని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Related posts

వైద్యుడంటే దేవుడితో సమానం: ఎ.ఎమ్.డి.ఇంతియాజ్

Bhavani

విద్యుత్ చార్జీలపై పెనమలూరు లో బోడె ప్రసాద్ నిరసన

Satyam NEWS

టీ20: ఫామ్ లో ఉన్న భారత్ గెలుపు సుళువే

Satyam NEWS

Leave a Comment