40.2 C
Hyderabad
May 1, 2024 18: 23 PM
Slider కర్నూలు

లంచం తీసుకున్న స్పెషల్ డిప్యూటి తహశీల్దార్ జైలు శిక్ష

#SpecialDeputy

రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతుకు నష్టపరిహారం మంజూరు చేసే విషయంలో రూ. 20 వేలు లంచం తీసుకున్న అప్పటి పీఏబీఆర్ -2 స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ కు 2 సంవత్సరాల జైలు శిక్ష… రూ. 25 వేలు జరిమానా విధించారు. ఈ మేరకు కర్నూలు ఏసిబి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది.

తాడిపత్రి పట్టణం పోరాట కాలనీకి చెందిన రైతు రంగస్వామి 3.02 ఎకరాల వ్యవసాయ భూమి పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోయారు. నష్టపరిహారం కోసం అప్పటి పీఏబిఆర్-2 స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పాల్యం షేక్ దావూద్ ను సంప్రదించాడు. ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో 13-05-2015 తేదీన లంచంగా రూ. 20 వేలు రైతు ఇస్తుండగా అనంతపురం ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై అనంతపురం ఏసిబి అధికారులు Cr.No.03/RCT-ATP/2015 కేసు నమోదు చేశారు. అనంతరం ఏసిబి అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కర్నూల్ A.C.B ప్రత్యేక కోర్టుకు దాఖలు చేశారు. విచారణ పూర్తి చేసి నేరం రుజువు అయినందున స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పాల్యం షేక్ దావూద్ ను దోషిగా నిర్ధారించి అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ 25 వేలు జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు చెప్పారు.

ఎవరయినా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే అనంతపురము DSP ఫోన్ నెంబర్ 9440446181 లేదా ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన 14400 కాల్ సెంటర్ లేదా ACB 14400 App కు గాని పిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ, కర్నూల్ రేంజ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజ్ఞప్తి చేశారు.

Related posts

గుడ్ అరేంజ్మెంట్స్: మేడారం ఏర్పాట్లు భేష్

Satyam NEWS

సీజనల్ వ్యాధులు తరిమికొట్టే బాధ్యత మనందరిపై ఉంది

Satyam NEWS

కంజపూర్ రోడ్ కు తరలిపోతున్న తాండూరు మార్కెట్

Satyam NEWS

Leave a Comment