30.7 C
Hyderabad
April 29, 2024 04: 41 AM
Slider నల్గొండ

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా పీవీ శతజయంతి

#Telangana Jagrithi

తెలంగాణ ముద్దుబిడ్డ భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో టౌన్ హాల్ లో PV చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాగృతి నాయకులు KLN రావు, జిల్లా నాయకులు ఎస్.కె మస్తాన్, మాట్లాడుతూ పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో భూసంస్కరణలు అమలు చేశారని, గురుకుల విద్యాలయాలను స్థాపించి గురుకుల విద్యకు ఆద్యుడయ్యారని అన్నారు.

దేశం ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యున్నతమైన దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టి సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, భారత దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన గొప్ప ఆర్థిక సంస్కర్త పీవీ నరసింహారావే అని, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త అని కొనియాడారు. నెహ్రూ కుటుంబేతర తొలి ప్రధానిగా సంకీర్ణ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన రాజకీయ దురంధరుడు పీవీ నరసింహారావు అని అన్నారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ దుండిగల నారాయణ, మహిళా కన్వీనర్ బోధ లక్ష్మి, ఉదారి సుధాకర్, మామిడి పన్నీరు, రఘురామ్, ఎస్ కె ముస్తఫా, యాకయ్య, గుండు శ్రీను, జైత్రమ్ నాయక్, బాణోతు ప్రసాద్, వెన్నం వేణు, శివ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

Satyam NEWS

పతనం అయిపోతున్న అదానీ నికర ఆస్తులు

Satyam NEWS

చంద్రబాబును, అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment