26.2 C
Hyderabad
March 26, 2023 12: 06 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం

aims fire

ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని మెడికల్ శాంపుల్స్, మెడికల్ రిపోర్టులు తగలబడి పోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్నరోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక రోగి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. కొన్నిఆపరేషన్ థియేటర్లు కూడా కాలిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారు. 22 అగ్నిమాపక దళాలను వినియోగించినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఈ అగ్ని ప్రమాదం జరిగిన బ్లాక్ లో లేరు.

Related posts

రోడ్డునపడ్డ నాయీ బ్రాహ్మణ కుటుంబాలు

Satyam NEWS

అక్రమ సంబంధం: కానిస్టేబుల్ చేతిలో గాయపడ్డ వ్యక్తి మృతి

Satyam NEWS

ప్ర‌తీ శుక్ర‌వారం శానిటేష‌న్‌, దోమ‌ల నివార‌ణ‌పై దృష్టి పెట్టాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!