తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌పై దుండగుడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇన్‌స్పెక్టర్ విల్సన్ మృతిచెందారు. కేరళ- కన్యాకుమారి సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.విధి నిర్వహణలో భాగంగా విల్సన్ వాహానాలను తనిఖీ చేస్తుండగా ఒకరు విల్సన్ పైకి అనుకోకుండా కాల్పులు జరిపారు.కాల్పులకు కారణం తెలియలేదు .గాయపడ్డ విల్సన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
previous post