40.2 C
Hyderabad
April 26, 2024 11: 31 AM
Slider ఆదిలాబాద్

భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

#payanshankar

భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం  వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్  డిమాండ్ చేశారు. బుధవారం  ఇంద్రవెల్లి మండలంలోని  పలు గ్రామాల్లో పర్యటించిన వర్షాలకు దెబ్బెతిన్న పత్తి, సోయాబీన్, తొగరి,  టమాటా వంటి  పంటలను పరిశీలించారు.  రైతులతో మాట్లాడి నష్టం వివరాలు ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి గులాబీ దరిద్రం పట్టిందన్నారు.  గతేడాది గులాబీ పురుగు పత్తి పంటలను నాశనం చేయగ ఈ సంవత్సరం గులాబ్ తుఫాను ముంచేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకొనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజనను రైతుల కోసం ప్రవేశపెట్టిందన్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించక రైతులను కష్టాల్లోకి నెట్టుతుందని మండిపడ్డారు. వారం రోజుల్లో చేతికి వచ్చే సోయాబీన్ పంట నీట మునిగి మొక్క మీదే మొలకలు వస్తున్నామన్నారు.  పత్తి పంట కూడా పింద దశ లో ఆగి పోయిందన్నారు. సమగ్ర సర్వ్ నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రకటన విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రైతులు అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. రైతులకు నష్ట పరిహారం అదేవిధంగా కెసిఆర్ మీద ఒత్తిడి తీసుకురావాలని జిల్లా ఎమ్మెల్యేలను  డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  రాజలింగు, ముకుంద్ రావు, రత్నాకర్ రెడ్డి , మరప రాజు. శేకావత్, భీమ్ రావు. తదితరులు ఉన్నారు.

Related posts

కరోనా కట్టడికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కోచ్ లు

Satyam NEWS

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి – komaram bheem

Satyam NEWS

వేములవాడ కోడెల మేతకు గడ్డిమోపులు

Satyam NEWS

Leave a Comment