30.2 C
Hyderabad
February 9, 2025 20: 10 PM
Slider జాతీయం

నో సర్వీస్ :పొగమంచు తో ఢిల్లీ లో విమానసర్వీసుల రద్దు

snoe at delhi air port

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పొగమంచు జనజీవానికి విఘాతంగా మారింది.ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేశారు.జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు మంచు కురుస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలకు తగ్గింది.

పొగమంచు ప్రభావంతోపాటు వాతావరణం అనుకూలించక పోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేశామని ఢిల్లీ విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు మంచు కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను రద్దు చేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో రన్ వేను మంచు కప్పేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు కురవడంతో సిమ్లా, కుల్లూ జిల్లాల్లో పలు రోడ్లను మూసివేశారు

Related posts

కారు కు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలి: ట్రాఫిక్ ఏసీపీ

mamatha

Essay writing really is a quite marvelous way for you to expose off your homework and academic skills

mamatha

జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment